Site icon NTV Telugu

Minister Roja: సచివాలయానికి తాళం..మంత్రి రోజాకు తప్పని నిరసన సెగ

Roja 1

Collage Maker 12 Nov 2022 01.09 Pm

ఏపీమంత్రి ఆర్ కె రోజాకు ఇంటిపోరు తప్పడం లేదు. స్వంత పార్టీనేతలే ఆమె ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. మరోసారి నగరిలో రోజాకు నిరసన సెగ తగిలింది. నగరి నియోజకవర్గం అధికార వైసీపీలో మరోసారి విభేదాలు రచ్చకెక్కాయి. సాయంత్రం నాలుగు గంటలకు వడమాలపేట మండలం పత్తిపుత్తూతులో గ్రామ సచివాలయాన్ని మంత్రి రోజా ప్రారంభించాల్సి ఉంది. అయితే అక్కడి నేతలు తమ నిరసన తెలిపారు.

Read Also: Bhakthi tv Koti Deepotsavam: 13వ రోజుకి కోటిదీపోత్సవం.. ఈరోజు విశేష కార్యక్రమాలు

సచివాలయానికి తాళం వేశారు జెడ్పీటీసీ మురళీధర్ రెడ్డి. సచివాలయ నిర్మాణానికి 25 లక్షలు ఖర్చు చేశానని, ఇప్పటి వరకూ బిల్లులు మంజూరు కాలేదంటూ తాళం వేశారు జెడ్పీటీసీ మురళీధర్ రెడ్డి. కేవలం మంత్రి రోజాను అడ్డుకోవడం కోసమే వ్యతిరేక వర్గం చేస్తున్నటువంటి పనిగా చెబుతున్నారు రోజా వర్గం. నియోజకవర్గంలో నెలకొన్న పరిస్థితుల పైన మంత్రి రోజా ఆవేదన వ్యక్తం చేస్తూనే వున్నారు. దీనిపై హైకమాండ్ కి కూడా ఆమె ఫిర్యాదు చేశారు. ఇలాగే ఉంటే రాజకీయం చేయలేమంటూ ఆమె వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. మంత్రి రోజా 2014, 2019 ఎన్నికల్లోనూ స్వల్ప మెజార్టీతోనే గెలుపొందారు. 2019 ఎన్నికల్లో రోజా వరుసగా నగరి నుంచి రెండో సారి గెలుపొందారు.

ఆ సమయంలోనే రోజా కు వ్యతిరేకంగా నియోజకవర్గంలో ఒక వర్గం పని చేసిందంటారు. ఆమెని ఎలాగైనా ఓడించాలని ఆ వర్గం పావులు కదిపింది. అయితే, నియోజకవర్గంలో రోజా వ్యతిరేక వర్గం 2019 కంటే ఇప్పుడే బలంగా మారిందని అంటున్నారు. మంత్రి రోజాకు సొంత పార్టీ నుంచే సమస్యలు ఎదురవుతున్నాయి. దీంతో, 2024 ఎన్నికల్లో నగరిలో రోజా గెలవాలంటే ప్రత్యర్ధి పార్టీల కంటే సొంత పార్టీ నేతల పైనే ఫోకస్ పెట్టాల్సి ఉంటుందని కామెంట్లు వినబడుతున్నాయి. పర్యటనకు రాకుండానే వ్యతిరేక వర్గం నిరసన తెలపడంపై రోజా ఎలా స్పందిస్తారో చూడాలి.

Read Also:Commercial Vehicles: కమర్షియల్‌ వెహికిల్స్‌కి.. కలిసొస్తున్న కాలం..

Exit mobile version