Site icon NTV Telugu

ఆంధ్ర యూనివర్సిటీ వద్ద ఆఫ్ఘన్ విద్యార్థుల శాంతియుత నిరసన

ఆంధ్ర యూనివర్సిటీ మెయిన్ గేట్ వద్ద ఆఫ్ఘనిస్తాన్ విద్యార్థులు శాంతియుత నిరసన చేస్తున్నారు. ఆఫ్ఘానిస్థాన్ లో జరుగుతున్న సంఘటనలను ఖండిస్తూ అఫ్ఘానిస్థాన్ విద్యార్థుల నిరసన చేస్తున్నారు. తాలిబన్లు అరాచకాలు ను తిప్పికొట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్ మహిళలకు రక్షణ కల్పించాలి, ఐక్యరాజ్యసమితి లో తాలిబన్లు కు రాజ్యం ఆమోదం వద్దని, పంజ్ షీర్ పోరాటానికి మద్దతుగా శాంతి యుత నిరసన చేపట్టారు. పాకిస్థాన్ వెంటనే తాలిబన్లకు సహకారం ఆపాలి డిమాండ్ చేసారు. అయితే గత నెలలో ఆఫ్ఘనిస్తాన్ ను పూర్తిగా తాలిబన్ లు ఆక్రమించుకున్న విషయం తెలిసిందే. ఆ కారణంగా చాలా మంది ప్రజలు దేశాన్ని విడిచి తమ ప్రాణాలను గుపెట్లో పెట్టుకొని పారిపోయారు. అలా వెళ్లిన వారికీ ఆశ్రయం ఇచ్చిన దేశాలలో మన భరత్ కూడా ఒక్కటి.

Exit mobile version