Rachamallu Sivaprasad Reddy: కడప జిల్లాలోని ప్రొద్దుటూరులో అసాంఘిక కార్యకలాపాలు పెరిగిపోతున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రొద్దుటూరు పట్టణం క్యాసినో, ఇతర అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారింది.. టీడీపీ ముఖ్య నాయకులే ఈ వ్యవహారాలను నడిపిస్తున్నారు.. వీరు మట్కా, జూదం, క్రికెట్ బెట్టింగ్‌తో పాటు గోవాలో క్యాసినోలను నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. ప్రొద్దుటూరులో గంజాయి విచ్చల విడిగా అమ్ముతున్నారు.. యువతను పెడత్రోవ పట్టిస్తున్నారని తెలిపారు. ఈ జూద కార్యకలాపాల నిర్వాహకులు.. ఈ నెల 23, 24, 25 తేదీలలో కడప నుంచి హైదరాబాద్ మీదుగా గోవాకు ఇండిగో విమానంలో టికెట్లు కూడా బుక్ చేసుకున్నారని మాజీ ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి చెప్పుకొచ్చారు.
Read Also: Maharashtra: దారుణం.. రూ.66 వేల పెట్టుబడితో 7.5 క్వింటాళ్ల ఉల్లి సాగు.. రాబడి రూ. 664..!
అయితే, ఈ అసాంఘిక కార్యకలాపాలు పోలీసులకు తెలిసిన నిర్లక్ష్యం వహిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు పేర్కొన్నారు. యువత భవిష్యత్తును నాశనం చేస్తున్నారు, తక్షణమే ఈ కార్యకలాపాలను ఆపమని టీడీపీ నాయకులను కోరుతున్నాను.. కొత్తగా వచ్చిన జిల్లా ఎస్పీ వీటిని అదుపు చేస్తారని నేను ఆశిస్తున్నాను.. అలాగే, ప్రొద్దుటూరు కేంద్రంగా టీడీపీ కౌన్సిలర్లు అక్రమంగా రేషన్ బియ్యాన్ని రవాణా చేస్తున్నారు.. నకిలీ మద్యం కూడా విచ్చలవిడిగా విక్రయిస్తున్నారు.. పేదవాడి రక్తాన్ని టీడీపీ నేతలు పీల్చే్స్తున్నారు.. తక్షణమే ప్రభుత్వం జోక్యం చేసుకుని ఈ అక్రమాలను అడ్డుకోవాలని రాచమల్లు శివప్రసాద్ రెడ్డి కోరారు.