Site icon NTV Telugu

New Liquor Shops In AP: ఏపీలో నేటి నుంచి తెరుచుకోనున్న కొత్త మద్యం దుకాణాలు..

Ap Wine

Ap Wine

New Liquor Shops In AP: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి ప్రైవేట్ మద్యం దుకాణాలు తెరచుకొనున్నాయి. 26 జిల్లాల్లో 3, 396 మద్యం దుకాణాలను వ్యాపారులు ప్రారంభించనున్నారు. గత ఐదేళ్లుగా ఏపీలో ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచిన మద్యం దుకాణాలు నిన్నటితో మూసివేశారు. ప్రైవేట్ వ్యక్తులకు టెండర్ ఇవ్వటం ద్వారా 1800 కోట్ల రూపాయల ఆదాయం ప్రభుత్వానికి వచ్చింది. ఈ వైన్ షాప్స్ ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు పని చేయనున్నాయి. తిరుపతిలో 227 షాప్స్ అత్యధికంగా ఉండగా.. అల్లూరి జిల్లాలో 40 అత్యల్పంగా ఏర్పాటు అవుతున్నాయి. డిపోల నుంచి సరుకు తీసుకుని నేరుగా షాపులను ఓపెన్ చేయనున్నారు వ్యాపారులు.

Read Also: Revanth Reddy: నేడు ఢిల్లీ వెళ్లనున్న ముఖ్యమంత్రి.. మంత్రివర్గ విస్తరణ కోసమేనా?

అయితే, ప్రభుత్వ నిబంధనల మేరకు స్కూళ్లు, కాలేజీలు, ప్రార్థనా మందిరాలు, హస్పటల్స్ కు వంద మీటర్ల దూరంలో ఈ కొత్త మద్యం షాపులు ఏర్పాటు చేయాలని తెలిపింది. నిబంధనల మేరకు చాలా చోట్ల కొత్తగా ఏర్పాటు చేసుకునేందుకు షాపులు దొరకడం లేదు. సిండికేట్‌తో సంబంధం లేకుండా సొంతంగా షాపులు దక్కించుకున్న వారు తమ లైసెన్సులను ఇతరులకు ఇచ్చేందుకు బేరసారాలు చేస్తున్నారు. దీంతో చాలా షాపులు చేతులు మారే ఛాన్స్ ఉంది.

Exit mobile version