Site icon NTV Telugu

President Draupadi Murmu: శ్రీశైలం పర్యటనకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము..

President Draupadi Murmu

President Draupadi Murmu

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మరోసారి ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు.. ఈ మధ్యే ఏపీలో పర్యటించిన ఆమెకు ఏపీ ప్రభుత్వం ఘనంగా పౌర సన్మానం చేసింది. పోరంకిలో గవర్నర్ బిష్వభూషన్ హరిచందన్.. సీఎం జగన్ ఆమెకు సన్మానం చేశారు. మూడు రోజుల పాటు జరిగిన పర్యటనలో విజయవాడ, విశాఖపట్నం, తిరుపతిల్లో జరిగిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.. తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు.. అయితే, ఇప్పుడు నంద్యాల జిల్లాలోని శ్రీశైలం క్షేత్రాన్ని సందర్శించనున్నారు రాష్ట్రపతి.. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీశైలానికి ఎంతో ప్రత్యేకత ఉంది.. ఈ నెల 26వ తేదీన శ్రీశైలం రాబోతున్నారు రాష్ట్రపతి..

Read Also:TTD EO Dharma Reddy: టీటీడీ ఈవోకు శిక్ష విధించిన హైకోర్టు..

ఈ నెల 26వ తేదీన మధ్యాహ్నం 12.15 గంటల ప్రాంతంలో శ్రీశైలం చేరుకుంటారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. మధ్యాహ్నం శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవారిని దర్శించుకోనున్నారు.. ఆ తర్వాత కేంద్ర టూరిజంశాఖ ద్వారా శ్రీశైలం దేవస్థానం చేపట్టిన ప్రసాదం స్కీమ్ పనులను ప్రారంభించనున్నారు.. కేంద్ర టూరిజం శాఖ 2014-15లో ఈ ప్రసాద్‌ స్కీమ్‌ను ప్రారంభించింది. ఈ స్కీమ్ ద్వారా పుణ్యక్షేత్రాలను పూర్తిస్థాయిలో అభివృద్ది చేయనున్నారు. టూరిస్టులను ఆకర్షించేందుకు వీలుగా మరిన్ని సౌకర్యాలు కల్పించనున్నారు. ఇక, రాష్ట్రపతి పర్యటన దృష్ట్యా.. శ్రీశైలం దేవస్థానం.. ఏపీ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది.. భారీ బందోబస్తు ఏర్పాటు చేయనుంది.. కాగా, ఇప్పటికే శ్రీశైలం రూపురేఖలు మార్చేశారు.. కొత్త స్కీమ్‌ ద్వారా మరింత అభివృద్ధి చెందబోతోంది..

Exit mobile version