NTV Telugu Site icon

Prakash Reddy: అందుకే నాకు మంత్రి పదవి రాలేదు

Prakashss

Prakashss

ఏపీలో సీఎం జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గం విస్తరణ వివాదాలు రేపింది. మంత్రి పదవి ఆశించి భంగపడ్డ అసంతృప్తికి లోనయ్యారు. అనంతపురం జిల్లా రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డిది అదే కథ. అయితే ఆయన ఇప్పుడిప్పుడే ఆ షాక్ నించి బయటకు వస్తున్నారు. తాజాగా ఆయన టీడీపీ, జనసేనపై కీలక కామెంట్లు చేశారు.

టీడీపీని సమాధి చేద్దామని నా వెంట వస్తున్న వైసీపీ కార్యకర్తలకు, నాయకులకు ధన్యవాదాలు. టీడీపీ హయాంలో జాకీ వెళితే.. దొంగలు పడ్డ ఆరు నెలలలకు కుక్కలు మోరిగినట్లు టీడీపీ నాయకులు అరుస్తున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం జనసేన పవనకళ్యాణ్‌ రెండో స్థానంలో ఉంటే చంద్రబాబు మూడో స్థానంలో ఉన్నారన్నారు ప్రకాష్ రెడ్డి.

Read Also: చిన్నపాటి తప్పిదాలు TTD కొంప ముంచాయా?

పవనకళ్యాన్ కు సీఎం పదవి ఇస్తేనే చంద్రబాబుకు మంచిది. రాప్తాడు అభివృద్ధిలో తగ్గేదేలేదు. మంచంపై ఉన్న మా నాన్నపైన, మా వదిన పైన, ఆరోగ్యం బాగలేక ఉన్న మా అన్న పైన నిందలు వేస్తున్నారు. జిల్లాలోని అతిపెద్ద నియంతృత్వ కుటుంబాన్ని మట్టికరిపించాం. జిల్లాను అభివృద్ధి చేసే అవకాశం నాకు దక్కలేదు. సామాజిక సమీకరణాలతో, జిల్లాలోని సమీకరణాలతో నాకు మంత్రి పదవి రాలేదన్నారు. నాతోనే ఉండమని వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయిన మూడో రోజే జగన్మోహన్ రెడ్డి చెప్పారు. అందుకే నేను మంత్రి పదవి కోసం ఎదురుచూడడం లేదన్నారు ప్రకాష్ రెడ్డి.