NTV Telugu Site icon

Chevireddy Bhaskar Reddy: బాలినేని మరీ ఇంతలా దిగజారి పోతాడని ఊహించలేదు..

Chevireddy Bhaskar Reddy

Chevireddy Bhaskar Reddy

మాజీమంత్రి బాలినేనిపై వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఫైర్ అయ్యారు. విద్యుత్ ఒప్పందాలపై బాలినేని శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యలు ఎవరూ హర్షించరన్నారు. బాలినేని అబద్ధాలు మాట్లాడటం చూస్తుంటే అబద్ధాలు కూడా ఇంత గొప్పగా మాట్లాడగలరా అనిపిస్తుందా అని విమర్శించారు. 4.50 రూపాయలతో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఒప్పందాలు చేసుకుంటే.. జగన్ సిఎం అయినా తర్వాత 2.48 రూపాయలకు తగ్గించారన్నారు. బాలినేని కొత్త పార్టీ వాళ్ల మెప్పు పొందటానికి ఇలా మాట్లాడి ఉండవచ్చని పేర్కొన్నారు. జగన్‌ను విమర్శిస్తే పార్టీలో మెచ్చుకుంటారు అని ఆయన దిగజారి మాట్లాడుతున్నారన్నారు. బాలినేని మరీ ఇంతలా దిగజారి పోతాడని ఊహించలేదన్నారు.. ఎమ్మెల్సీ కోసం ఇప్పటికే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని అనుకుంటున్నారని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తెలిపారు.

Read Also: Robinhood: శ్రీలీలతో నితిన్ వన్ మోర్ టైం.. ఎప్పుడంటే?

బాలినేని మంత్రిగా ఉన్నపుడు మంచి జరిగితే అందరికీ చెప్పాలన్నారు.. సెకి నుంచి లెటర్ వచ్చినప్పుడు మీరు సంతకం పెట్టిన విషయం మర్చిపోయారా అని చెవిరెడ్డి భాస్కరరెడ్డి ప్రశ్నించారు. రెండుసార్లు ఒప్పందాలపై సంతకాలు పెట్టి.. ఇప్పుడు అర్థరాత్రి నన్ను సంతకం పెట్టామన్నారు అని చెప్పటం బాధాకరమన్నారు.. క్యాబినెట్ లో కొన్ని అంశాలు టేబుల్ అజెండాగా వస్తాయని.. సభ్యుల ఆమోదంతో తీర్మానాలు అవుతాయని అందరికీ తెలుసన్నారు. ఏ కుటుంబం అయితే ఆయనను రాజకీయంగా ఈ స్థితికి తీసుకువచ్చిందో వారిపైనే విమర్శలు చేస్తున్నారని తెలిపారు. బాలినేని గతంలో తనకు స్వేచ్ఛ లేదని చెప్పటం సరికాదని.. ఆయన మంత్రిగా ఉన్నప్పుడు చార్టెడ్ ఫ్లైట్‌లో ఇతర పార్టీల నేతలతో విదేశాలకు వెళ్లేంత స్వేచ్ఛ ఉందని చెవిరెడ్డి అన్నారు. జగన్ మీద అభాండాలు వేసి వ్యక్తిత్వ హననం చేసి లబ్ధి పొందాలనుకుంటే మీకే రివర్స్ అవుతుందని.. రోజులు ఎప్పుడు ఒకేలా ఉండవని గుర్తుంచుకోవాలన్నారు. ఒక వ్యక్తిని ఎదుర్కోవటానికి చేయాల్సిన దుర్మార్గాలు అన్నీ చేస్తున్నారని చెవిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read Also: INDIA alliance: మహారాష్ట్రలో కాంగ్రెస్ ఓటమికి కారణం ఇదే.. కర్ణాటక హోం మంత్రి కీలక వ్యాఖ్యలు..