NTV Telugu Site icon

No Sankranti Festival: సంక్రాంతి జరుపుకోని ఊరు ఉంది..! అక్కడ అంతా రివర్స్‌.. ఎక్కడ..? ఎందుకంటే..?

No Sankranti Festival

No Sankranti Festival

No Sankranti Festival: సంక్రాంతి వచ్చిందంటే చాలు తెలుగులోగిళ్లలో సంబరాలు అంబరాన్ని తాకుతాయి.. అయితే, సంక్రాంతి పండుగ చేసుకోనటువంటి గ్రామం కూడా ఒకటి ఉందంటే అది ఆశ్చర్యం. ఆ గ్రామం ప్రకాశం జిల్లాలోనే ఉంది.. కొమరోలు మండలం ఓబులాపురం గ్రామంలో అంతా రివర్స్‌.. ఎక్కడైనా సంక్రాంతి వచ్చిందంటే సొంత ఊరికి వస్తుంటారు.. కానీ, సంక్రాంతి పండుగ వచ్చింది అంటే సొంత ఊరు వదిలి ఇతర గ్రామానికి వెళ్తారు. రాష్ట్రమంతా ఉన్న ప్రజలు ఇతర గ్రామాల నుంచి స్వగ్రామాలకు వచ్చే సంక్రాంతి పండగ చేసుకుంటే మీరు మాత్రం ఇతర రాష్ట్రాలకు వెళ్లి పండుగలో పాల్గొంటారు..

Read Also: Delhi Election 2025: ఢిల్లీ సీఎం అతిషికి బిగ్ షాక్.. ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించినందుకు కేసు నమోదు!

ప్రకాశం జిల్లా కొమరోలు మండలం చింతలపల్లి పంచాయితీ ఓబులాపురం గ్రామంలో దాదాపుగా 100 కు పైగా కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. ఇక్కడ నివసిస్తున్న కుటుంబాల ప్రజలంతా బసవన్నలను (గంగిరెద్దులు) ఆడిస్తూ జీవనం సాగిస్తుంటారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు మాట్లాడుతూ సంక్రాంతి వచ్చిందంటే చాలు ఈ గ్రామంలోని ప్రజలందరూ గంగిరెద్దులాడించుకుంటూ కర్ణాటక రాష్ట్రం వైపుకు వెళ్తామని.. పక్క రాష్ట్రాల వారు తమను సాంప్రదాయంలో భాగంగా అదేపనిగా బసవన్నలతో సహా పిలుచుకుంటారని అక్కడ సంక్రాంతి ఉత్సవాలు నిర్వహించుకుంటామని.. అందరూ సంక్రాంతికి సొంత ఊర్లకు వస్తే.. ఈ గ్రామ ప్రజలు విచిత్రంగా సొంత గ్రామం నుండి పక్క రాష్ట్రాలకు వలస వెళ్తామని.. అందరూ సంక్రాంతికి ఎక్కడ నుంచో సొంత ప్రాంతాలకు వస్తే మేం మాత్రం మా గ్రామం వదలి వెళ్తామని తెలియజేశారు. కర్ణాటకలోని బెంగుళూరు మరియు ఆంధ్ర సరిహద్దు ప్రాంతలలో బెంగుళూరు, టున్కూర్, దవనగిరి, హో బెంగుళూరు ఇంకా అనేక ప్రాంతాలలో సంక్రాంతి పండుగకి కాక వారి వివాహాలలో సన్నాయిమెలం, బ్యాండ్ మేళం వాయించేందు వెల్తామని చెప్తున్నారు. ఇప్పుడిప్పుడే గంగిరెద్దుల పాడించే ఆట సాంప్రదాయాన్ని విడనాడి కూలి పనులు చేసుకుంటూ పిల్లలు ను చదివించుకుంటున్నమని కొందరు గంగి రెడ్డుల కళాకారులు తెలిపారు.

Show comments