సైబర్ నేరాలపై పోలీసులు హెచ్చరికలు జారీ చేసినా కొందరు వారి వలలో చిక్కుకుంటున్నారు. ఇక కాలర్ టోన్‌లో కూడా డిజిటల్ అరెస్ట్‌లు ఏమీ లేవంటూ అలర్ట్ చేసినా కొందరు మాత్రం కేటుగాళ్ల ఎత్తులకు భయపడి డబ్బులు పోగొట్టుకున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది.
ఇది కూడా చదవండి: Gold Rates: న్యూఇయర్ వేళ బంగారం, సిల్వర్ ధరలు ఇలా!
అద్దంకిలో ఉంటున్న రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి నాగేశ్వరరావును సైబర్ నేరగాళ్లు డిజిటల్ అరెస్ట్ పేరుతో బెదిరించి రూ.1.23 కోట్లు లాక్కున్నారు. హవాలా చేస్తున్నందుకు అరెస్టు చేస్తున్నామంటూ నాగేశ్వరరావు దంపతులను బెదిరించారు. వారం రోజులుగా వీడియో కాల్ ద్వారా నాగేశ్వరావు దంపతులను ఇంట్లోనే ఉంచి డిజిటల్ అరెస్టు చేస్తున్నట్లు సైబర్ నేరగాళ్లు బెదరగొట్టారు. దీంతో వృద్ధ దంపతులైన ఇద్దరు భయాందోళనకు గురై మూడు దఫాలుగా 1.23 కోట్ల రూపాయలు పోగొట్గుకున్నారు. ఇల్లు కూడా అమ్మి నగదు బదిలీ చేయాలని డిమాండ్ చేయడంతో బాధితుడు నాగేశ్వరరావు పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Jaishankar: ఢాకాలో జైశంకర్ పర్యటన.. పాకిస్థాన్ స్పీకర్‌తో భేటీ
