Site icon NTV Telugu

Minister Gottipati: ఆర్థిక అసమానతలు తొలగించేందుకు సీఎం చంద్రబాబు పీ4ని తీసుకొచ్చారు..

Gottipati

Gottipati

Minister Gottipati: ఒంగోలులో పీవీఆర్ స్కూల్ శతజయంతి ఉత్సవాల్లో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్నీ దానాల్లో కల్లా విద్యాదానం చాలా గొప్పది.. అన్నదానం ఒకరు మాత్రమే ఆకలి తీర్చుతుంది.. విద్యాదానం వ్యక్తి ఆకలితో పాటు వ్యవస్థను కూడా సరి చేస్తోంది.. నెల్లూరులో ప్రైవేటు స్కూల్ కు ధీటుగా మంత్రి నారాయణ వీఆర్సీ పాఠశాలను నిర్మించారు.. అన్నీ ప్రభుత్వాలే చేసే వరకు ఎదురు చూడక.. వ్యక్తులు కూడా సమాజాభివృద్ధికి చొరవ చూపాలి.. పూర్వ విద్యార్థులు, దాతలు ముందుకొస్తే గ్రామీణ విద్యావ్యవస్థ బలోపేతం అవుతుంది అని మంత్రి గొట్టిపాటి పేర్కొన్నారు.

Read Also: IND vs NZ 1st ODI: బౌలింగ్‌ ఎంచుకున్న భారత్‌.. ప్లేయింగ్ 11లోకి శ్రేయస్‌ అయ్యర్‌!

ఇక, ఆర్థిక అసమానతలు తొలగించేందుకు సీఎం చంద్రబాబు పీ4ను తీసుకొచ్చారు అని మంత్రి రవి కుమార్ తెలిపారు. రాజకీయాలకు దూరంగా నేడు ప్రభుత్వ పాఠశాలలు కొత్తరూపు సంతరించుకుంటున్నాయి.. అద్దంకిలో విద్యార్థులు నడిచి స్కూల్ వెళ్తుంటే.. చలించి స్టూడెంట్స్ కు ఉచితంగా సైకిళ్లు పంపిణీ చేస్తున్నామని పేర్కొన్నారు. దాతల సాయంతో ఇప్పటి వరకు 6500 మంది పాఠశాల విద్యార్థులకు సైకిళ్లు అందజేశాం.. విద్యార్థి దశలోనే ప్రతీ ఒక్కరికి ప్రాణ మిత్రులు పరిచయం అవుతారని గొట్టిపాటి రవికుమార్ వెల్లడించారు.

Exit mobile version