Site icon NTV Telugu

Operation Cheetah Success: ఫలించిన ఆపరేషన్‌.. ఎట్టకేలకు చిక్కిన చిరుత..

Operation Cheetah Success: ప్రకాశం గిద్దలూరు మండలం దేవనగరంలో ఫారెస్ట్ అధికారులు చేపట్టిన ఆపరేషన్ చిరుత ఫలించింది. ఎట్టకేలకు చిరుత చిక్కింది.. ఫారెస్ట్ అధికారులు ఏర్పాటు చేసిన ట్రాప్ కి చిరుత చిక్కింది.. గత 24 గంటలుగా చిరుత కోసం ఆపరేషన్ చిరుత కొనసాగింది.. గిద్దలూరు మండలం దేవనగరం సమీపంలో నిన్న ఓ గుంతలో చిరుత చిక్కుకుంది. చిరుత పులిని బయటకు తీసుకు వచ్చేందుకు 24 గంటలుగా ఫారెస్ట్ అధికారుల ఆపరేషన్ చిరుత కొనసాగింది.. పలుసార్లు ప్రయత్నించిన అనంతరం చిరుత చిక్కుకున్న గుంతలో నీటిని నింపి బయటకు వచ్చే ప్రయత్నంలో ఫారెస్ట్ అధికారులు సఫలమయ్యారు.. నీరు లోపలకు వెళ్ళటంతో గుంతలో నుండి బయటకు వచ్చిన చిరుత ట్రాప్ లో చిక్కుకోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు..

Read Also: Dushyant Chautala: రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కి మద్దతు..బీజేపీకి షాక్ ఇచ్చిన మాజీ మిత్రుడు..

అయితే, ప్రకాశం జిల్లా దేవనగరం ప్రాంతంలో చిరుతలు తిరుగుతున్నాయని, ఎన్నడు లేని విధంగా మనషులపై దాడులు చెయ్యడం, చంపడం తీవ్ర కలకలం రేపుతుంది. ఎలాగైన చిరుతపులిని త్వరగా పట్టుకుని తమ ప్రాణాలు కాపాడాలని డిమాండ్ చేస్తూ ధర్న నిర్వహించారు. ఫారెస్ట్ అధికారులు చిరుతను త్వరలో పట్టుకుంటాం అని హామి ఇవ్వడంతో అందోళన విరమించారు. అనుకున్నటు ఇవాళ ఉదయం 7 గంటల నుంచి ఆపరేషన్ చెప్పటగా దాదాపు 6 గంటలు తరువాత గుంత నుంచి బయటకి వచ్చింది. కానీ చిక్కినట్టే చిక్కి మల్లి గుంతలోకి వెళ్లిపోయింది.. ఇలా ముప్పు తిప్పలు పెట్టిన తర్వాత.. 24 గంటలు గడిచిన తర్వాత ఆ చిరుత చిక్కింది.

Exit mobile version