Minister Narayana: టిడ్కో ఇళ్లపై లబ్ధిదారులకు శుభవార్త చెప్పారు ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ.. ప్రకాశం జిల్లా పర్యటనలో ఉన్న ఆయన.. మాట్లాడుతూ.. లబ్ధిదారులకు దీపావళి నాటికి టిడ్కో ఇళ్లు అందజేస్తామని వెల్లడించారు.. గత ప్రభుత్వ విధానాలతో రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక కష్టాలు వచ్చినా.. ఉన్నా.. ప్రజల సంక్షేమానికి, రాష్ట్ర అభివృద్ధికి సమ ప్రాధాన్యం ఇస్తున్నాం అని తెలిపారు.. ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలు నెరవేరుస్తాం. మున్సిపాలిటీలు, పట్టణ అభివృద్ధి సంస్థల పరిధిలో మౌలిక వసతులు కల్పిస్తున్నాం. గ్రామీణ ప్రాంతాల్లోనూ అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు మంత్రి నారాయణ..
Read Also: Xiaomi AI Glasses: 12MP కెమెరా, AI అసిస్టెంట్ తో.. షియోమి నుంచి AI స్మార్ట్ గ్లాసెస్ విడుదల..
కాగా, ఇప్పటికే టిడ్కో ద్వారా నిర్మించిన ఇళ్లను అప్పగించే పనులు వేగవంతం చేసేందుకు సహకరించాలని ఇప్పటికే బ్యాంకర్లను మంత్రి నారాయణ కోరిన విషయం విదితమే.. బుధవారం ఏడీసీఎల్ భవనంలో బ్యాంక్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఆయన.. పీఎంఏవై పథకం విజయవంతానికి బ్యాంకర్లు కీలక పాత్ర పోషించాలని కోరారు. ఇక, దీపావళి నాటికి ఇళ్లను పూర్తి చేయడానికి పెండింగ్ నిధులను విడుదల చేయాలని, కొత్త రుణాలను అందించడంలోనూ ప్రభుత్వానికి సహకరించాలని మంత్రి నారాయణ విజ్ఞప్తి చేసిన విషయం విదితమే..
