NTV Telugu Site icon

YCP: వైసీపీకి గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు షాక్..

Anna Rambabu

Anna Rambabu

YSRCP: వైసీపీకి గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు షాక్ ఇచ్చారు. అనారోగ్య వల్ల వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటున్నానని మీడియాసమావేశంలో వెల్లడించారు. 2009లో ప్రజారాజ్యం తరఫున తొలిసారి ఆయన పోటీ చేశారు. అనంతరం ఆ పార్టీ కాంగ్రెస్ లో విలీనంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా కొనసాగి 2014లో టీడీపీలో చేరారు.. అనంతరం భారీ బహిరంగ సభ పెట్టి టీడీపీని వీడుతున్నట్లు ప్రకటించారు.. ఇక, 2019లో వైఎస్ఆర్సీపీలో చేరి సీఎం జగన్ తర్వాత 80 వేల పైచిలుకు మెజారిటీతో అన్నా రాంబాబు గెలిచారు. తాజాగా ఆనారోగ్య కారణాలతో పోటీ చేయటం లేదంటూనే పలువురు వైసీపీ నేతలపై విమర్శలు గుప్పించారు.

Read Also: Couple Sells Everything: క్రూయిజ్ షిష్‌లో ప్రపంచ పర్యటన.. ఆస్తులన్నీ అమ్మేసుకున్న జంట

గిద్దలూరు వైసీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు మాట్లాడుతూ.. ఇటివల నేను పార్టీ మారుతున్నానంటూ చేస్తున్న ప్రచారంలో నిజం లేదు.. నాపై జరుగుతున్న దుష్ప్రచారంపై జిల్లా లోని పార్టీ పెద్దల దృష్టికి తీసుకు వెళ్ళా.. నన్ను వ్యక్తిగతంగా నా కులాన్ని సైతం దూషించారు.. జిల్లా పార్టీ పెద్దల నుంచి నాకు సరైన మద్దతు లభించకపోవటం నా దురదృష్టం.. ఒక ఎమ్మెల్యే అయి ఉండి సొంత వాళ్లే కించపరిచినా ఎవరూ ఓదార్చలేదు అని ఆయన పేర్కొన్నారు. సీఎంకి నేను పోటీ చేయనని ముందే చెప్పా.. సీఎం నన్ను ఉండాలని గట్టిగా చెప్పటం వల్లే నేను పోటీ చేస్తానని ప్రకటించాను.. డబ్బులు తీసుకుని రాజకీయాలు చేసే వ్యక్తిని కాదు అని చెప్పుకొచ్చారు. ప్రకాశం జిల్లాకి ఒంగోలు ఎంపీ మాగుంట ఏమి చేశారు.. ప్రకాశం జిల్లా ప్రజలు గమనించాలి.. మాగుంట కుటుంబాన్ని రాజకీయాల్లో ఆదరించకూడదు.. డబ్బున్న మారాజులు ఏ పార్టీకైనా వెళ్తారు అంటూ ఎమ్మెల్యే అన్నా రాంబాబు విమర్శించారు.