NTV Telugu Site icon

Janasena Vs TDP Flex War: జనసేన వర్సెస్‌ టీడీపీ..! ఒంగోలులో ఫ్లెక్సీల రగడ

Janasena Vs Tdp

Janasena Vs Tdp

Janasena Vs TDP Flex War: ప్రకాశం జిల్లా ఒంగోలులో ఫ్లెక్సీ రగడ మొదలైంది.. ఒంగోలు చర్చి సెంటర్ లో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిని జనసేనలోకి ఆహ్వానిస్తూ కొందరు ఆ పార్టీ నేతలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.. అయితే, వాళ్లు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో జనసేన నేతలతో పాటు ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఫోటోలు పెట్టారు.. బాలినేని ఫోటోలతో పాటు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఫోటోలు కలిపి పెట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన టీడీపీ కార్యకర్తలు.. ఆ ఫ్లెక్సీలను తొలగించారు.. బాలినేని వంటి నేతలు గతంలో తమను ఇబ్బందులు పెట్టి ఇప్పుడు జనసేనకు వస్తున్నారని ఆరోపించారు.. బాలినేని పార్టీ మార్పు వ్యవహారంలో తమ నేతల అనుమతి తీసుకోకుండా ఫ్లెక్సీలు ఎలా ఏర్పాటు చేస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఎన్నికలకు ముందు జనసేనలోకి వచ్చిన వారిని స్వాగతిస్తామని.. ఇప్పుడు వచ్చే వారు మీ ఇష్టానుసారం చేయాలని చూస్తే తాట తీస్తామని హెచ్చరిస్తున్నారు టీడీపీ నేతలు.

Read Also: Ujjain Mahakaleshwar temple: ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయ ప్రసాదానికి సేఫ్ భాగ్ అవార్డు.. ఎలా తయారు చేస్తారంటే ?

కాగా, ప్రకాశం జిల్లాకు చెందిన వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు.. గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్న బాలినేని వ్యక్తిగత కారణాలు, అంతర్గత విభేదాలతో పార్టీని వీడుతున్నట్లు తన రాజీనామా లేఖను పార్టీ అధినేత జగన్ కు పంపించారు.. రాజకీయాలు వేరు.. బంధుదుత్వాలు వేరంటూ లేఖలో ఘటు వ్యాఖ్యలు చేసిన బాలినేని మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో భేటీ అయ్యారు… ఇద్దరి మధ్య ఏకాభిప్రాయం కుదరటంతో ఆయన చేరికకు పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు.. దీంతో ఆయన దాదాపుగా వచ్చే 4వ తేదీన ఒంగోలులో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి తన అనుచరులతో పాటు పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలో చేరనున్నారు..