Site icon NTV Telugu

జాయ్‌ పార్క్‌లో జాతీయ జెండా ఎగురవేస్తాం: ప్రభాకర్‌రెడ్డి

రిపబ్లిక్‌ డే రోజు జాయ్‌ పార్క్‌లో జాతీయ పతాకం ఎగురవేయవద్దని అధికారులను బెదిరించడం సరికాదని తాడిపత్రి మున్సిపల్‌ చైర్మన్‌ జేసీ ప్రభాకర్‌రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మేము నిర్మించి జాయ్‌ పార్క్‌కు రిజిస్ట్రేషన్‌ ఉంది మీరు నిర్మిస్తున్న పార్క్‌కు రిజిస్ట్రేషన్ ఉందా అని ప్రశ్నించారు. అధికారులతో సమావేశం ఏర్పాటు చేస్తే సమావేశానికి వెళ్లవద్దని అధికారులను బెదిరింపులకు గురిచేయడం సరికాదని ఆయన అన్నారు. ప్రజలు మీకు ఇచ్చిన అధికారాన్ని తాడిపత్రి అభివృద్ధి కోసం ప్రయత్నిస్తే సహకరిస్తామన్నారు. తాడిపత్రి జాయ్ పార్క్‌లో రిపబ్లిక్‌ డే రోజు ఎన్ని ఆటంకాలు ఎదురైనా జాతీయ జెండా ఎగురవేస్తామని ప్రభాకర్‌రెడ్డి తెలిపారు.

Exit mobile version