Site icon NTV Telugu

Andhra Pradesh: పరిశ్రమలకు కరెంట్ కష్టాలు.. నేటి నుంచి పవర్ హాలీడే

Power Cuts

Power Cuts

ఏపీలో పరిశ్రమలకు కరెంట్ కష్టాలు ప్రారంభమయ్యాయి. విద్యుత్ డిమాండ్ పెరిగిపోవడంతో ఎస్పీడీసీఎల్‌ పరిధిలో పరిశ్రమలకు విద్యుత్‌ కోతలు అమలు చేస్తున్నట్లు ఏపీ ఎస్పీడీసీఎల్‌ సీఎండీ హరనాథరావు పేర్కొన్నారు. ఎస్పీడీసీఎల్‌ పరిధిలో ఉన్న 253 ప్రాసెసింగ్‌ పరిశ్రమలు కేవలం 50 శాతం విద్యుత్‌ మాత్రమే వాడుకోవాలని సూచించారు. 1,696 పరిశ్రమలకు వారంలో ఒక రోజు పవర్‌ హాలీడే ప్రకటించినట్లు ఆయన చెప్పారు. వీక్లీ హాలీడేకు అదనంగా ఒక రోజు పవర్‌ హాలిడే పాటించాలని పరిశ్రమలను యాజమాన్యాలకు సీఎండీ కోరారు. ఈ నెల 8 నుంచి 22వ తేదీ వరకు రెండు వారాల పాటు పరిశ్రమలకు పవర్‌ హాలీడే అమలులో ఉంటుందని హరనాథరావు వివరించారు.

ఏపీలో విద్యుత్ డిమండ్ అధికంగా ఉండటంతో పరిశ్రమలకు 50 శాతం కోత విధిస్తున్నట్లు ట్రాన్స్‌కో అధికారులు ప్రకటించారు. దీంతో పాటు ఒక రోజు పరిశ్రమలకు విద్యుత్‌ సరఫరా పూర్తిగా నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు. రెండు వారాల పాటు విద్యుత్‌ కోత అమల్లో ఉంటుందని అధికారుల తెలిపారు. ఏప్రిల్‌ 1వ తేదీన 235 మిలియన్‌ యూనిట్ల వినియోగం జరిగిందని, బయటి మార్కెట్‌ నుంచి 64 మిలియన్‌ యూనిట్లను కొనుగోలు చేసినట్లు విద్యుత్‌ అధికారులు పేర్కొన్నారు. కాగా అన్ని విధాలుగా విద్యుత్‌ను సమకూర్చుకున్నా రోజుకు 40 నుంచి 50 మిలియన్‌ యూనిట్ల కొరత ఏర్పడుతోందని ఏపీ ట్రాన్స్‌కో ఎగ్జిటక్యూటివ్‌ డైరెక్టర్‌ తెలిపారు.

https://ntvtelugu.com/perni-nani-comments-on-power-cuts-in-andhra-pradesh/

Exit mobile version