NTV Telugu Site icon

Jana Sena: పవన్ కళ్యాణ్ మాట్లాడుతుండగా మంగళగిరిలో పవర్ కట్

Pawan Kalyan 2

Pawan Kalyan 2

ఉమ్మడి నల్గొండ జిల్లా పర్యటన ముగించుకుని మంగళగిరి చేరుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ కార్యాలయంలో మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. అయితే పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్న సమయంలో కరెంట్ పోయింది. దీంతో పవన్ కళ్యాణ్‌ ఒక్కసారిగా షాక్ అయ్యారు. అనంతరం సెల్ ఫోన్ వెలుగులోనే మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వచ్చే ఎన్నికల్లో పొత్తులపై పవన్ మరింత క్లారిటీ ఇచ్చారు. ఎన్నికల్లో ఓట్లు చీలనివ్వకుండా ఉండేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తానన్నారు. రాజధాని విషయంలో బీజేపీ అధినాయకత్వాన్ని ఒప్పించినట్లే.. ఓట్ల చీలిక విషయంలోనూ బీజేపీ హైకమాండ్‌ను ఒప్పించే ప్రయత్నం చేస్తానని తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యానే ఓట్లను చీలనివ్వకూడదనే నిర్ణయం తీసుకున్నట్లు పవన్ వివరించారు. ఎవరితో పొత్తులకు వెళ్లాలో మాకు వైసీపీ చెప్పాల్సిన అవసరం లేదని హితవు పలికారు.

MLC Driver Death: రేపు కాకినాడలో టీడీపీ నిజనిర్ధారణ కమిటీ పర్యటన

మంత్రి పదవులను తాము చెప్పిన వాళ్లకు జగన్ ఇస్తారా అని పవన్ ప్రశ్నించారు. ఓట్లు చీలనివ్వమన్న చిన్న పదానికి వైసీపీ నేతలు ఎందుకు భయపడుతున్నారో చెప్పాలన్నారు. ఏపీలో ముందస్తు ఎన్నికలపై ఇప్పుడే ఏం చెప్పలేనని పవన్ వ్యాఖ్యానించారు. ఎక్కడ పోటీ చేసినా తనను ఓడిస్తామన్న వైసీపీ నేతల ఛాలెంజ్‌ను స్వీకరిస్తున్నట్లు పవన్ తెలిపారు. ఓడలు బండ్లు అవుతాయి.. బండ్లు ఓడలవుతాయని.. తనను విమర్శించిన మాజీ మంత్రులకు ఇప్పటికైనా తెలిసుండాలని ఎద్దేవా చేశారు. తనను తిడితే పదవి కలకాలం నిలవదని వైసీపీ నేతలు గ్రహించే ఉంటారని పవన్ ఆరోపించారు. సీపీఎస్‌ విధానానికి చర్చల ద్వారానే పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు. లక్షల కోట్లు విదేశాలకు తరలించే తెలివితేటలున్నపుడు.. సీపీఎస్‌ సమస్యను పరిష్కరించే తెలివి తేటలు ఉండవా అని జగన్ ప్రభుత్వాన్ని పవన్ కళ్యాణ్ నిలదీశారు. ప్రజలకు దగ్గరయ్యే విధంగా తన యాత్ర ఉంటుందని తెలిపారు. ఇప్పటికే అప్పుపుట్టని పరిస్థితిలోకి రాష్ట్రాన్ని తీసుకెళ్లారని.. ఏపీ ఆర్థిక పరిస్థితిపై కేంద్రానికి పూర్తి అవగాహన ఉందని పవన్ అన్నారు.

Show comments