NTV Telugu Site icon

Power Boats In Vijayawada: ఫలించిన సీఎం చంద్రబాబు ప్రయత్నాలు.. విజయవాడకు చేరిన పవర్ బోట్స్..!

Power Boats

Power Boats

Power Boats In Vijayawada: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నాలు ఫలించాయి. విజయవాడకు పవర్ బోట్స్ చేరుకున్నాయి. నిన్న కేంద్రంతో మాట్లాడిన తరువాత వివిధ రాష్ట్రాల నుంచి విజయవాడకు బోట్స్ వచ్చాయి. దీంతో బోట్స్ ద్వారా సింగ్ నగర్ ముంపు ప్రాంతంలో ఆహారం పంపిణీ కొనసాగుతుంది. పెద్ద ఎత్తున బోట్స్ రావడంతో ఇళ్ల నుంచి బాధితులను బయటకు తెచ్చే పనులు వేగవంతం అయ్యాయి. పునరావాస కేంద్రాలకు వెళ్లే వాళ్లకు దుస్తులు కూడా ఇవ్వాలని సీఎం ఆదేశించారు. పాల ప్యాకెట్లు, ఆహారం, నీళ్ళ బాటిల్స్ అందిస్తున్న ప్రభుత్వం.. ప్రైవేటు హోటల్స్, దుర్గగుడి, అక్షయపాత్రల ద్వారా ఏపీ సర్కార్ ఆహారం సమకూర్చింది.

Read Also: Pawan Kalyan : పడి లేచిన కెరటం.. సామాన్యుడి ధైర్యం.. జనసేనాని ‘పవన్ కళ్యాణ్’..

ఇక, ముంపు ప్రాంతాల్లో మరో సారి సీఎం చంద్రబాబు పర్యటించి సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఫలితాన్నిస్తున్న ముఖ్యమంత్రి నిరంతర సమీక్షలు, మానిటరింగ్.. సీఎం సూచనలతో వేగంగా అధికార యంత్రాంగం కదిలింది. నిరంతర పర్యవేక్షణతో ఉదయం వరకు ఆహారం సిద్దం చేసి పంపిణీ చేపట్టిన అధికారులు.. స్వయంగా ముఖ్యమంత్రి ముంపు ప్రాంతాల్లో రాత్రంతా తిరగడంతో సహాయక చర్యలు వేగం పుంజుకున్నాయి.

Show comments