Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Political Leaders Condolences To Mallu Swarajyam

RIP Mallu Swarajyam: రేపటి తరాలకు తరగని స్ఫూర్తి

Published Date :March 19, 2022 , 9:22 pm
By NTV WebDesk
RIP Mallu Swarajyam: రేపటి తరాలకు తరగని స్ఫూర్తి
  • Follow Us :
  • google news
  • dailyhunt

తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం ఆకస్మిక మరణం పట్ల పలువురు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. మల్లు స్వరాజ్యం మరణంతో ఆసుపత్రికి చేరుకున్నారు సీపీఎం నేత, మాజీ ఎంపీ మధు. ఆమె మరణానికి తీవ్ర సంతాపం తెలిపారు. స్వరాజ్యం మరణం తీరని లోటు. భూస్వామ్యక కుటుంబంలో పుట్టిన పోరాట యోధురాలుగానే ఆమె నడిచింది. ఆమె జీవితం ప్రజల కోసం అర్పించింది అన్నారు మధు. మల్లు స్వరాజ్యం ఆకస్మిక మృతికి సంతాపం తెలిపారు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి.

తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు, భారత కమ్యూనిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు, పీడిత ప్రజల పక్షపాతి, మాజీ ఎమ్మెల్యే మల్లు స్వరాజ్యం మరణం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు తీవ్ర సంతాపం తెలిపారు. నాటి రైతాంగ పోరాటానికి కేంద్రంగా నిలిచిన తుంగతుర్తి గడ్డ అందించిన చైతన్యంతో ఎదిగిన మహిళా యోధురాలు మల్లు స్వరాజ్యం అని సీఎం అన్నారు. తన జీవితాంతం ప్రజల కోసం అహర్నిశలు కృషి చేసిన మల్లు స్వరాజ్యం జీవన గమనం గమ్యం రేపటి తరాలకు స్ఫూర్తి దాయకం అని సీఎం తెలిపారు. మల్లు స్వరాజ్యం వంటి మహిళా నేతను కోల్పోవడం తెలంగాణకు తీరని లోటని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు సీఎం తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

https://ntvtelugu.com/freedom-fighter-mallu-swarajyam-is-no-more/

స్వాతంత్య్ర సమరయోధురాలు శ్రీమతి మల్లు స్వరాజ్యం నేడు అనారోగ్యంతో మరణించారన్న వార్త తీవ్రంగా బాధించిందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. చివరివరకు నమ్మిన సిద్ధాంతం కోసం పని చేసిన వ్యక్తి. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం నిరంతరం వారి పక్షాన నిలబడి పోరాడిన వ్యక్తి. శ్రీమతి మల్లు స్వరాజ్యం మరణం తెలుగు ప్రజలకు తీరని లోటు అని సంతాపం తెలిపారు కిషన్ రెడ్డి. మల్లు స్వరాజ్యం మృతి పట్ల వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం సానుభూతి తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నా అని ప్రకటన విడుదల చేశారు.

స్వరాజ్యం గారు మరణం తెలంగాణ కు తీరని లోటు. సాయుధ పోరాటంలో ముందుండి నడిపించిన నాయకురాలు స్వరాజ్యం అన్నారు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి. ఆమెను మాలాంటి వారు ఎందరో స్ఫూర్తిగా తీసుకున్నాం. శ్రీమంతుల కుటుంబం నుంచి వచ్చిన ఆమె పోరాటం సాగించింది. 90 సంవత్సరాల వరకు ప్రజా క్షేత్రంలో స్వరాజ్యం వున్నారు. పేద, గిరిజన, బడుగు, బలహీన వర్గాలకు ఆమె ఆశా జ్యోతి. నాకు, నా కుటుంబానికి వ్యక్తిగతంగా స్వరాజ్యం గారు స్ఫూర్తి. ప్రజల్లోకి వెళ్లి నువ్వు కొట్లడలి అని నాకు ఆమె చెప్పింది. తెలంగాణ శిఖరాగ్రం నేలకొరిగింది. వారి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ తరపున ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాం అన్నారు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • CPM
  • kcr
  • kishanreddy
  • Mallu Swarajyam
  • rajakars

తాజావార్తలు

  • US-Iran Plan: అలా అయితే హార్ముజ్ ఓపెన్ చేయం.. సంధిపై ఇరాన్ కీలక వ్యాఖ్యలు..

  • Rajamouli: జక్కన్న మామూలోడు కాదు.. ఏకంగా VFX స్టూడియో సెటప్!

  • Sanjiv Goenka Gets Emotional: ఏడ్చిన సంజీవ్ గోయెంకా.. ఎందుకంత ఎమోషనల్.?

  • Rishabh Pant-SRH: పంత్ బ్రో.. సన్‌రైజర్స్ హైదరాబాద్ అంటే ఎందుకంత పగ!

  • PCB Chairman vs IPL: ఇంత కుల్లుబోతోడివి ఏందయ్యా నువ్వు.. ఐపీఎల్‌పై పీసీబీ ఛైర్మన్ ఏడుపు!

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions