NTV Telugu Site icon

Political Turmoil: ప్రశాంతనిలయంలో అగ్గి రాజేసింది ఎవరు?

atp tdpvsysrcp

Collage Maker 09 Apr 2023 09 27 Am 8222

రాజకీయ నాయకులు ఏం మాట్లాడినా.. స్వలాభం కోసమే మాట్లాడతారు.. కానీ ఆ మాటలు ఎంత దూరం తీసుకెళ్తాయన్నది వారికి ఆసమయంలో పని లేదు. ఇలా అర్థం పర్థం లేని ఆరోపణలు, విమర్శలు సవాళ్లు, ప్రతి సవాళ్లతో నిత్యం ప్రశాంతంగా ఒక ఆధ్యాత్మిక కేంద్రం ఉద్రిక్తతలకు నిలయంగా మారింది. భక్తి మాటలు తప్ప ఏమి వినపడిన చోట చెప్పుల వర్షం రాళ్ల వర్షం కురిసింది. పోలీసుల లాఠీ ఛార్జ్ చేశారు. ఇంతకీ ప్రశాంత నిలయంలో అగ్గి రాజేసింది ఎవరు.. దాని పర్యావసనాలు ఏంటి?

పుట్టపర్తి.. ప్రపంచ పటంలో ఆధ్యాత్మిక కేంద్రంగా ఒక గుర్తింపు ఉన్న ప్రాంతం. సత్యసాయి బాబా కొలువు దీరిన ఈ ప్రాంతాన్ని ప్రశాంతి నిలయం అంటారు. ఎంతో మంది దేశ విదేశాలకు చెందిన ప్రతినిధులు, అంతెందుకు ముఖ్యమంత్రులు, గవర్నర్లు చివరకు రాష్ట్ర పతులు కూడా ఇక్కడికి వస్తే ప్రశాంతంగా ఉంటుందనే భావన ఉంటుంది. నిత్యం సాయిరాం అనే నామం వినిపిస్తుంటుంది. కానీ ఇలాంటి చోట రాజకీయ నాయకులు చేసిన ప్రసంగాలు.. అగ్గి రాజేశాయి. రాళ్ల వర్షం చెప్పుల వర్షం కురిసి ప్రశాంతంతకు భంగం కలిగేలా చేసింది. ఇంతకీ ఏం జరిగింది.. అసలు ఈ పరిస్థితికి బీజం ఎక్కడ పడింది…పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డిని ఒక అవినీతి పరుడని.. దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి కాదని.. దోపిడీ కుంట శ్రీధర్ రెడ్డి అని కామెంట్ చేశారు. దీంతో పాటు ఎమ్మెల్యే పై కొన్ని ఆరోపణలు కూడా చేశారు. ఇదే వేదికపై పల్లె కూడా విమర్శలు గుప్పించాయి.

Read Also: PM Narendra Modi: “ప్రాజెక్ట్ టైగర్‌”కి 50 ఏళ్లు.. నేడు పులుల డేటా విడుదల చేయనున్న ప్రధాని

సరిగ్గా ఇక్కడే అసలు మ్యాటర్ స్టార్ట్ అయింది. నన్నే దోపిడీ కుంట అంటావా… దుద్దుకుంట అంటే ఒక బ్రాండ్.. అంటూ మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డిపై విరుచకపడ్డారు. వైసీపీ అధికారం లోకి వచ్చిన నాలుగునరేళ్ళలో పుట్టపర్తి అభివృద్ధిపై బహిరంగ చర్చకు నేను సిద్ధమేనని.. ప్లేస్, టైం నువ్వే డిసైడ్ చేసుకో ఎక్కడికి రమ్మన్నా వస్తానని ఛాలంజ్ చేశారు. పుట్టపర్తిలోని సత్యమ్మ దేవాలయం వద్ద ఏప్రిల్ 1న ప్రమాణానికి నేను సిద్ధమంటూ సవాల్ చేశారు. దీనికి పల్లె రఘునాథ్ రెడ్డి నేను కూడా సిద్ధమనేంటూ ప్రతి సవాల్ చేశారు. అంతే కాదు ఎమ్మెల్యేని రేయ్ శ్రీధర్ రెడ్డి నోరు అదుపులో పెట్టుక అంటూ రఘునాథ్ రెడ్డి మాట్లాడారు. దీంతో సీన్ మొత్తం రచ్చ రచ్చగా మారింది. నేను కూడా సత్యమ్మ ఆలయం వద్ద ప్రమాణం చేయడానికి రెడీ అంటూ సవాల్ చేశారు.

చివరకు ఏప్రిల్ 1వ తేది రానే వచ్చింది. పుట్టపర్తిలో హైటెన్షన్ మొదలైంది. ముందుగా అప్రమత్తమైన పోలీసులు పుట్టపర్తిలో ఎలాంటి రాజకీయ సమావేశాలు నిర్వహించకూడదని… 30యాక్ట్ అమల్లో ఉందని హెచ్చరించారు. అయినా ఎవరూ తగ్గలేదు. శ్రీధర్‌ రెడ్డి, పల్లె రఘునాథ్ రెడ్డి ఈరోజు సత్తెమ్మ దేవాలయానికి వస్తున్నారన్న నేపథ్యంలో పోలీసులు అలెర్ట్ అయ్యారు. పల్లె రఘునాథ్ రెడ్డిని ఇంటి నుంచి బయటకు రావద్దని స్పష్టం చేశారు. పల్లె ఆఫీస్ చుట్టూ భారీగా పోలీసులను మోహరించారు.

అయితే వైసీపీ ఎమ్మెల్యేను మాత్రం సత్తెమ్మ దేవాలయానికి వెళ్లారు. ఈ సమాచారం అందుకున్న టీడీపీ శ్రేణులు ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చి ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో టీడీపీ, వైసీపీ వర్గీయులు రాళ్లు, చెప్పులతో పరస్పరం దాడి చేసుకున్నారు. దీంతో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. పోలీసుల సమక్షంలోనే ఇరు వర్గాలు దాడులు ప్రతిదాడులకు దిగారు. ఈ దాడుల్లో మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి, ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి వాహనాలు ధ్వంసమయ్యాయి. తోపులాటలో పల్లె రఘునాథ్‌ రెడ్డి సొమ్మసిల్లి పడిపోయారు. సుమారు రెండు మూడు గంటల పాటు బీభత్సం జరిగింది. ఈ దాడుల పర్వంలో ఇటు పల్లె కాని అటు శ్రీధర్ రెడ్డి కానీ ఎవరూ తగ్గలేదు. చివరకు పోలీసులు ఇరు వర్గాల వారిని చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

Read Also: Tea Cups: బాబోయ్‌ పేపర్‌ కప్పులు..