Madanapalle Incident: అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయ ప్రమాద ఘటన కేసులో విచారణ కొనసాగుతోంది. మొత్తం 2,400 రికార్డులు కాలిపోయినట్లు అధికారులు గుర్తించారు. సగం వరకు కాలిపోయిన 700 రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న పెద్దిరెడ్డి అనుచరుడు మాధవ్ రెడ్డి కోసం పోలీసుల గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఆర్టీవోలు హరిప్రసాద్, మురళీ సహా జూనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజ్ సహా అనుమానితులైనా 37 మందిని నాలుగో రోజు పోలీసులు విచారించనున్నారు. గత రాత్రి ఆర్డీవో సీసీ మణి,ఎన్నికల డీటీ అస్లాం, సీనియర్ అసిస్టెంట్లు భరత్ రెడ్డిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. మరోవైపు నేడు మదనపల్లెకు సీఎస్ నీరబ్‌కుమార్ ప్రసాద్ వెళ్లనున్నారు. సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని ఆయన పరిశీలించనున్నారు. సీఎస్ పర్యటన నేపథ్యంలో ఉమ్మడి జిల్లాకు చెందిన ఆర్డీవోలు, ఎమ్మార్వోలు మదనపల్లెకు రావాలని ఆదేశాలు ఇచ్చారు. జిల్లాలో 22ఏ, చిక్కుల భూముల, ఇనాం స్థలాల వివరాలను సీఎస్ అధికారులు ఇవ్వనున్నారు. పూర్తి సమాచారంతో రావాలని అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి.
Read Also: Operation Dhoolpet: ఆపరేషన్ దూల్పేట్.. గంజాయి నిర్మూలన లక్ష్యంగా దాడులు..