Site icon NTV Telugu

Birthday Party: బర్త్ డే పార్టీపై పోలీసుల దాడి.. కేజీకి పైగా గంజాయి సీజ్

ఈమధ్యకాలంలో యువత మత్తుపదార్దాలకు బానిసలుగా మారుతున్నారు. ఎక్కడ అవకాశం వస్తే అక్కడ మత్తు పదార్ధాలు రవాణా చేయడం చేస్తున్నారు. తాజాగా ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో ఓ బర్త్ డే పార్టీలో కలకలం రేగింది.
ఏసీపీ హనుమంతరావు కథనం ప్రకారం… శుక్రవారం అర్థరాత్రి శాంతినగర్ లో సందీప్ అనే యువకుడి పుట్టినరోజు వేడుకల సందర్భంగా 10మంది కంటే ఎక్కువ యువకులు ఉన్నారనే సమాచారంతో మా సిబ్బంది తనిఖీకి వెళ్ళారు. పోలీసులను చూడగానే ఈ పుట్టినరోజు వేడుకలకు వచ్చిన విజయవాడకి చెందిన కిషోర్ అనే వ్యక్తి పరారయ్యాడన్నారు.

ఈ పుట్టినరోజు వేడుకలను తనిఖీ చేశాం. 12మంది యువకులను, ముగ్గురు యువతులను అదుపులోకి తీసుకుని,సుమారు 1కేజీ పైగా గంజాయిని స్వాధీనం చేసుకున్నాము. ఈ గంజాయి పరారైన విజయవాడకి చెందిన వ్యక్తి కిషోర్ కి చెందినదిగా మావిచారణలో తేలిందన్నారు. అయితే మేం పట్టుకున్న ముగ్గురు యువతులు వంట చేయడానికి వెళ్ళారు.వారికి ఈ పార్టీకి సంబంధం లేదు.విచారించి పంపేశామన్నారు. పరారైన వ్యక్తి దొరికితే గంజాయికి సంబంధించి పూర్తి సమాచారం తెలుస్తుందని ఏసీపీ హనుమంతరావు వివరించారు.

Read Also: BJP: పాకిస్తాన్ కూడా చేయలేని ఆరోపణలను రాహుల్ గాంధీ దేశంపై చేస్తున్నారు.

Exit mobile version