Site icon NTV Telugu

Visakhapatnam: విశాఖలో వివాహిత శ్రావణి మర్డర్ కేసును ఛేదించిన పోలీసులు

Vsp Murder

Vsp Murder

విశాఖ పట్నం బీచ్ రోడ్డులో కలకలం రేపిన వివాహిత శ్రావణి మర్డర్ కేసును పోలీసులు చేదించారు. సుమారు ఉదయం నాలుగు గంటల సమయంలో బీచ్ రోడ్డు వద్ద మహిళ డెడ్ బాడీని గుర్తించామని క్రైమ్ డీసీపీ విద్యాసాగర్ నాయుడు చెప్పుకొచ్చారు. శ్రావణి అనే మహిళాతో గోపాల్ అనే వ్యక్తి తో పరిచయం ఉంది.. గోపాల్ అనే వ్యక్తి పరవాడలో ఉంటాడు.. హత్య చేసిన అనంతరం గాజువాక పోలీస్ స్టేషన్ లో అతను లొంగిపోయాడు అని క్రైమ్ డీసీపీ వెల్లడించారు.

Also Read : IPL 2023 : బ్యాటింగ్ లో దుమ్మురేపుతున్న వార్నర్.. 10 ఓవర్లకు స్కోర్..?

మృతురాలు శ్రావణికి గోపాల్ కి జనవరి నుంచి పరిచయం ఉంది.. శ్రావణి కి ఐదు సంవత్సరాల క్రితం పెళ్లయింది.. పెళ్లి అయిన రెండు ఏళ్ళకి భర్త నుంచి విడిపోయింది అని క్రైమ్ డీసీపీ విద్యాసాగర్ నాయుడు తెలిపారు. గత కొద్దీ రోజులు శ్రావణి, గోపాల్ సహజీవనం చేశారు.. పెళ్లి విషయంలో ఇద్దరి మధ్య చాలా రోజుల నుంచి గొడవ జరుగుతుంది.. వెంకీ అనే వ్యక్తి తో కూడా శ్రావణి సన్నిహితంగా ఉండటం ఇద్దరు మధ్య గొడవకి కారణం అయింది అని ఆయన వెల్లడించారు.

Also Read : PM Modi: “యుద్ధాన్ని ఆపేందుకు సాధ్యమైనదంతా చేస్తాం”.. ఉక్రెయిన్‌కు ప్రధాని హామీ..

వెంకీతో సాన్నిహిత్యం గురించి గొడవ అయినప్పుడు శ్రావణిని గొంతు నొక్కి గోపాల్ చంపేశారు. వెంకీ, గోపాల్ పెయింటింగ్ వర్క్ చేస్తారు..శ్రావణి జగదాంబ సెంటర్ లోని చెప్పుల షాపు లో పని చేస్తుంది అని క్రైమ్ డీసీపీ విద్యాసాగర్ నాయుడు పేర్కొన్నారు. అయితే నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని విశాఖ పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదైంది.

Exit mobile version