శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా గుంటూరు జిల్లాలో తెల్లవారుజామున పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. శుక్రవారం తెనాలి పట్టణం సుల్తానాబాద్ లో వడ్డెర కాలనీ, సుగాలి కాలనీ తదితర ప్రాంతాల్లో తెల్లవారుజాము నుంచి ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. అడిషనల్ ఎస్పీ రమణమూర్తి, తెనాలి డి.ఎస్.పి బి జనార్ధన రావు నేతృత్వంలో ఈ ప్రాంతంలోని దాదాపు 350 ఇళ్లలో సోదాలు నిర్వహించారు. తెనాలి సబ్ డివిజన్ పరిధిలోని నలుగురు సీఐలు, ఎస్ఐలతో సహా 160 మంది దాకా సిబ్బంది ఆ తనిఖీల్లో పాల్గొన్నారు.
Also Read: OTT : ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతున్న ‘గేమ్ ఛేంజర్’.. ఫ్యాన్స్ షాక్
కార్డెన్ సెర్చ్ లో ఆరుగురు రౌడీషీటర్లను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. సరైన పత్రాలు లేని 59 వెహికల్స్ ను సీజ్ చేశారు. తనిఖీలలో భాగంగా ఇతర రాష్ట్రాలకు చెందిన నలుగురు యువకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు. వారి వద్ద నుంచి నిషేధిత పదార్థాన్ని స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా పోలీసులు ప్రజలంతా భాద్యతాయుతంగా ఉండాలని, అనుమానంగా ఎవరైనా కనిపిస్తే తమకు సమాచారం అందించాలని సూచించారు.