NTV Telugu Site icon

Police Case: అచ్యుతాపురం ఎసైన్షియా ఫార్మా ప్రమాదంపై కేసు నమోదు..

Anaka

Anaka

Police Case: అనకాపల్లి జిల్లాలోని అచ్యుతాపురంలోని ఫార్మా సెజ్ లో జరిగిన ప్రమాదంపై రాంబిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎసైన్షియా ఫార్మా ప్రమాదంపై.. ఇప్పటికే అధికారులు విచారణ చేశారు. ఈ సందర్భంగా ఎసైన్షియా ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ యాజమాన్యంపై BNS 106 (1), 125(b),125(a) సెక్షన్ కింద కేసులు నమోదు చేశారు. అలాగే, నిర్లక్ష్యంతో మరణానికి కారణం, ప్రాణాలకు వ్యక్తిగత భద్రతకు భంగం వాటిల్లడం వంటి సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు పోలీసులు.

Read Also: BRS Dharna: నేడు రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు.. చేవెళ్లలో కేటీఆర్‌, ఆలేరులో హరీష్‌ రావు..

ఇక, వేపర్ క్లౌడ్ ఎక్స్ ప్లోజన్ వల్ల పేలుడు జరిగింది అని ఫైర్ సర్వీస్ డీజీ నివేదిక ఆధారంగా హోం మంత్రి వంగలపూడి అనిత తెలిపింది. ఫార్మా కంపెనీ ప్రమాదానికి భద్రత వైఫల్యం కారణం.. MTBE అనే గ్యాస్ లీకేజ్, సాల్వెంట్ తో కలవడం వల్ల అగ్ని ప్రమాదం సంభవించింది అన్నారు. గ్యాస్ పేలుడు కారణంగా ప్రొడక్షన్ యూనిట్ గోడలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి.. దీంతో 17 మంది మరణించాగా, 35 మంది చికిత్స పొందుతున్నారు అని ఆమె పేర్కొన్నారు. పరిశ్రమలో 381 మంది సిబ్బంది పని చేస్తున్నారు.. ఇప్పటి వరకు అందరినీ ట్రేస్ చేశామన్నారు. ముఖ్యమంత్రి క్షతగాత్రులను పరామర్శించిన తర్వాత ప్లాంట్ విజట్ కు వస్తారు.. యాజమాన్యం బాధ్యతారాహిత్యం స్పష్టంగా కనిపిస్తోంది.. ప్రమాదకరమైన సాల్వెంట్ లు అన్నీ ఓపెన్ గా ఉన్నాయి.. ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి అనిత పేర్కొనింది.