NTV Telugu Site icon

Polavaram Project: పోలవరం డెడ్‌లైన్‌ను పొడిగించిన కేంద్ర ప్రభుత్వం

Polavaram Project

Polavaram Project

polavaram project deadline extended: ఏపీ ప్రజల జీవనాడి పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం గడువులోపు పూర్తికాలేదని కేంద్రం తెలిపింది. దీంతో పోలవరం నిర్మాణ గడువును పొడిగిస్తున్నట్లు వెల్లడించింది. గడువులోపు పూర్తి కాకపోవడంతో 2024 జూలై వరకు పోలవరం ప్రాజెక్టు నిర్మాణ గడువు పెంచినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు రాజ్యసభలో టీడీపీ ఎంపీ కనకమేడల అడిగిన ప్రశ్నకు జలశక్తి సహాయశాఖ మంత్రి బిశ్వేశ్వర్ తుడు లిఖిత పూర్వకంగా సమాధానమిచ్చారు.

Read Also: Chandra Babu: నాలుగంటే నాలుగే.. ఇదేనా జగన్ సర్కార్ వరద సాయం?

ఇప్పటివరకు హెడ్ వర్క్స్ 77శాతం, కుడి కాల్వ పనులు 93శాతం, ఎడమ కాల్వ పనులు 72శాతం పూర్తయినట్లు కేంద్రమంత్రి బిశ్వేశ్వర్ తుడు తెలిపారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీ 2021 నవంబర్‌లో ఒక కమిటీని నియమించిందని ఆయన పేర్కొన్నారు. అన్ని అంశాలను అధ్యయనం చేసిన కమిటీ.. 2022లో నివేదిక ఇచ్చిందన్నారు. ప్రాజెక్టు నిర్మాణ గడువును 2024 జూన్ వరకు పొడిగించాలని కమిటీ సూచించిందని కేంద్రమంత్రి బిశ్వేశ్వర్ తుడు అన్నారు. అటు ఈరోజు పోలవరం నిర్మాణ గడువుపై మంత్రి అంబటి రాంబాబు కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. పోలవరం నిర్మాణం ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేమని.. దశలవారీగా మాత్రమే ప్రాజెక్టు పూర్తవుతుందని మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు.