రాష్ట్ర విభజనపై ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనపై కీలక వ్యాఖ్యలు చేశారు ప్రధాని నరేంద్ర మోడీ.. ఇవాళ రాజ్యసభలో మాట్లాడిన ఆయన.. అనేక అంశాలపై స్పందించారు.. ఇక, రాష్ట్ర విభజనపై కీలక వ్యాఖ్యలు చేశారు ప్రధాని మోడీ.. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన సరిగ్గా చేసి ఉంటే ఇలాంటి సమస్యలు ఉండేవి కావన్నారు.. మరోవైపు.. రాష్ట్ర విభజనకు మేం వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. రాజకీయ స్వార్థం కోసం ఏపీని హడావుడిగా విభజించారని ఆరోపించిన మోడీ… అయితే విభజన కోసం అనుసరించిన పద్ధతి సరికాదన్నారు.. తలుపులు మూసి పేపర్ స్ప్రే కొట్టారని నాటి ఘటనలను గుర్తుచేశారు.. ఎలాంటి చర్చ జరగకుండానే విభజన బిల్లును ఆమోదించారని విమర్శించారు.. రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగంపై చర్చ సందర్భంగా ప్రధాని మోడీ ఈ వ్యాఖ్యలు చేశారు.
Read Also: ఈడీ దృష్టికి గుడివాడ కేసినో వ్యవహారం..
Also Read
- Veligonda Project: 30 ఏళ్ల కల సాకారం.. రేపు వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1 ప్రారంభించనున్న సీఎం..
- Vijaysai Reddy: సొంత కారణాలతోనే విజయసాయి రెడ్డి బయటకు వెళ్లారు.. పబ్లిసిటీ కోసం ప్రయత్నిస్తున్నారు!
- Rajamahendravaram: గోదావరిలో హౌస్‌బోట్.. రాజమహేంద్రవరంలో పర్యాటకానికి ఫుల్ జోష్!
- Tirupati: శేషాచలం అడవుల్లో రెండుగా విడిపోయిన ఏనుగుల గుంపు.. అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక!
కాగా, యూపీఏ 2 ప్రభుత్వంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌గా కాంగ్రెస్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.. ఈ సందర్భంగా విభజన చట్టంలో పేర్కొన్న అనేక అంశాలు ఇప్పటికీ అమలుకు నోచుకోవడం లేదు.. ఎన్నో దఫాలుగా అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణ.. కేంద్రం దృష్టికి సమస్యలను తీసుకెళ్లినా పరిష్కారం కాని సమస్యలు ఎన్నో ఉన్నాయి.. ఇక, ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే విషయమై కేంద్ర ప్రభుత్వం చెప్పేవన్నీ కుంటిసాకులే అంటూ రాజ్యసభలో సోమవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డి ధ్వజమెత్తిన విషయం తెలిసిందే.. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై రాజ్యసభలో జరిగిన చర్చలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుంటిసాకులు చెబుతూ ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించకుండా కాలయాపన చేస్తోందని దుయ్యబట్టారు..
- Tags
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్‌కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!