NTV Telugu Site icon

అనంత‌పురం రోడ్డుప్ర‌మాదంపై ప్ర‌ధాని దిగ్భ్రాంతి.. ఎక్స్‌గ్రేషియా ప్ర‌క‌ట‌న‌

అనంతపురం జిల్లాలో ఆదివారం జ‌రిగిన ఘోర రోడ్డు ప్ర‌మాదంపై దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ.. జిల్లాలోని ఊరుకొండ సమీపంలో ఇన్నోవా వాహనాన్ని వేగంగా దూసుకొచ్చిన‌ లారీ ఢీకొట్టిన ప్ర‌మాదం ఒకే కుటుంబానికి చెందిన 9 మంది దుర్మరణం పాల‌య్యారు.. వివాహ వేడుక కోసం బళ్లారి నుంచి నింబగల్లుకు వెళ్తుండ‌గా ఈ ఘోరం జ‌రిగింది.. అయితే, ఈ ఘ‌ట‌న‌పై తీవ్ర దిగ్భ్రాంతి వ్య‌క్తం చేసిన ప్ర‌ధాని మోడీ.. ప్ర‌మాదంలో మ‌ర‌ణించిన వాళ్ల‌లో ఒక్కొక్క‌రికి రూ.2 ల‌క్ష‌ల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్ర‌క‌టించారు.. కాగా, ఈ ప్ర‌మాదంలో బొమ్మణహల్ కు చెందిన అశోక్, రాధమ్మ, సరస్వతి, శివమ్మ, రాయల దొడ్డికి చెందిన శుభద్రమ్మ, లత్తవరంకు చెందిన స్వాతి, జాహ్నవి, నింబగల్లుకు చెందిన వెంకటప్ప మృతిచెందారు.

Read Also: ల‌తా మంగేష్క‌ర్‌కు రాజ్య‌స‌భ నివాళి