NTV Telugu Site icon

Dwaraka Tirumala: శ్రీలలితా త్రిపుర సుందరీదేవిగా కుంకుళ్ళమ్మవారు

West Dtl (1)

West Dtl (1)

దసరా నవరాత్రులు వైభవంగా సాగుతున్నాయి. ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల శక్తి స్వరూపిణి శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవిగా క్షేత్ర దేవత కుంకుళ్ళమ్మ అమ్మవారి అలంకరణ భక్తులను పరవశింపచేసింది. శ్రీవారి ప్రధాన ఆలయానికి దత్త దేవాలయమైన ఈ ఆలయంలో దసరా మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా అమ్మవారు రోజుకో అలంకరణలో భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పిస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం శ్రీ లలిత త్రిపుర సుందరి అలంకరణ లో కుంకుళ్ళమ్మ దర్శనం భక్తులను అలరించింది.

Read Also: AP Anganwadi Posts: పారదర్శకంగానే అంగన్ వాడీ పోస్టుల భర్తీ

శంకు చక్రాలు శూలాన్ని ఆయుధాలుగా చేసుకుని అభయ హస్తాన్ని ప్రదర్శిస్తూ విశేష పుష్పాలంకరణ లతో ఉన్న కుంకుళ్లమ్మ అమ్మవారిని పలువురు భక్తులు దర్శించుకున్నారు. ఒకవైపు లక్ష్మీదేవి మరోవైపు సరస్వతి దేవి లు వింజామరలు వీస్తున్నట్లున్న అమ్మవారి దర్శనం భక్తులకు కనువిందు చేసింది. అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించి ప్రత్యేక కుంకుమ పూజలు జరుపుకున్నారు. ఏటా దసరా ఉత్సవాలకు ఆ ఆలయానికి భారీగా భక్తులు తరలివస్తారు. పనిలో పనిగా వెంకటేశ్వరస్వామిని కూడా దర్శించుకుని వెళతారు.

Read Also: Kottu Satyanarayana on Dasara: ఇంద్రకీలాద్రిపై దసరా ఏర్పాట్లు భేష్.. లడ్డూ సూపర్