Vizag Crime: విశాఖపట్నంలో ఓ ప్లే స్కూల్ ప్రిన్సిపాల్ ఆత్మహత్య కలకలం రేపుతోంది.. సిటీ పోలీసు కమిషనర్ శ్రీకాంత్ తెలిపిన వివరాల ప్రకారం.. మువ్వల అలేఖ్య ఆత్మహత్య చేసుకున్నారు.. ఆమె వయస్సు 29 ఏళ్లు.. ఆమె భర్త నరేష్, వారి ఇద్దరు పిల్లలు, కుటుంబ సభ్యులతో కలసి ఎంవీపీకాలనీలో నివాసం ఉంటున్నారు.. నరేష్ ఏఆర్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు.. ప్రస్తుతం సీబీఐ విభాగంలో డిప్యూటేషన్‌పై పనిచేస్తున్నట్టుగా చెబుతున్నారు.. అయితే, దంపతుల మధ్య కొన్నేళ్లుగా గొడవలు జరుగుతున్నాయని తెలుస్తోంది.. రెండేళ్ల కిందట అలేఖ్య తన ఇద్దరు పిల్లలతో కలసి ఆరిలోవ ప్రాంతం మయూరినగర్‌కు వెళ్లిపోయింది.. అక్కడే ఓ ఇల్లు అద్దెకు తీసుకొని అందులోనే ప్లే స్కూల్ నడుపుతూ జీవనం సాగిస్తోంది.. కానీ, ఆదివారం అర్ధరాత్రి ఆమె ఆత్మహత్యకు పాల్పడింది.. ఇంట్లో ఉరిపోసుకుని బలవన్మరణం చెందింది..
Read Also: PVN Madhav: బీజేపీలో అభిప్రాయ బేధాలే.. విభేదాలు లేవు..
ఇక, అలేఖ్య ఆత్మహత్య చేసుకున్న గదిలోకి వెళ్లి చూసి షాక్ తిన్న కూతరు.. బంధువులకు సమాచారం ఇచ్చింది.. ఘటనా స్థలానికి చేరుకున్న బంధువులు.. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.. కేసు నమోదు చేసిన ఆరిలోవ పోలీసులు. దర్యాప్తు ప్రారంభించారు.. ఈ ఘటనలో భర్త ప్రమేయంపై విచారణ సాగిస్తున్నట్టు తెలుస్తోంది.. భార్యాభర్తలు కొంత కాలంగా కలిసి ఉండకపోవడంతో.. అదే కోణంలో వారు విచారణ సాగిస్తున్నట్టుగా సమాచారం. మరోవైపు.. అలేఖ్య తన 11 ఏళ్ల వయసు గల కుమారుడిని విజయవాడలో ఓ హాస్టల్‌లో చేర్చించింది.. తొమ్మిదేళ్ల కుమార్తెతో కలసి ఆరిలోవలో ఉంటున్న ఆమె మృతికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అలేఖ్య మృతికి భర్త వేధింపులు కారణమని ఆమె తల్లి ఆరిలోవ పోలీసులకు ఫిర్యాదు చేశారు.