Site icon NTV Telugu

AP News :వర్మ, వంగా గీత మధ్య మాటల తూటాలు

Vanga Geetha, Varma

Vanga Geetha, Varma

పిఠాపురం మాజీ ఎమ్మెల్యేలు వర్మ – వంగా గీత మధ్య యూరియా సరఫరా సమస్యపై మాటల తూటాలు పేలుతున్నాయి. రెండు రోజుల క్రితం పిఠాపురంలోని పొలాల్లో రైతుల వద్దకు వెళ్లి యూరియా సమృద్ధిగా దొరుకుతుందా అని పరిశీలించిన వర్మ, వైసీపీ ఎమ్మెల్యేలను “కళ్ళు ఉన్న కబోదులు” అని విమర్శించారు. వర్మ మాట్లాడుఊ.. “అసెంబ్లీలో వచ్చి మాట్లాడండి. రాష్ట్రంలో ఎక్కడా యూరియా కొరత లేదు. ప్రభుత్వం పారదర్శకంగా యూరియా సరఫరా చేస్తోంది. వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్న 11 నియోజకవర్గాలలో ఎక్కడైనా యూరియా కొరత ఉంటే నేను తీసుకుని వస్తాను” అని తెలిపారు. దీనికి కౌంటర్ గా వంగా గీత స్పందించారు. “పొలాల్లోకి వెళ్ళి యూరియా చల్లి వీడియో తీయడం కాదు. ఇప్పుడు సొసైటీల దగ్గరికి వెళ్లి క్యూ లైన్‌లో ఉన్న రైతులతో మాట్లాడండి. యూరియా కొరత లేకుండా రైతులు ఎందుకు క్యూ లైన్‌లో ఉన్నారో తెలుసుకుని ఆ వీడియో చూపించండి” అని గీత సూచించారు.

Ambati Rambabu : కూటమి ప్రభుత్వం యూరియా సరఫరాలో విఫలం

Exit mobile version