Site icon NTV Telugu

Pilli Subhash Chandrabose: పిల్లి సుభాష్ కీలక వ్యాఖ్యలు.. పార్టీ మార్పుపై క్లారిటీ

Pilli Subhash

Pilli Subhash

Pilli Subhash Chandrabose Interesting Comments Over Ramachandrapuram Ticket Issue: రామచంద్రపురం సీటు విషయంలో మంత్రి వేణుగోపాల కృష్ణ, ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ మధ్య వాగ్వాదం జరుగుతున్న విషయం తెలిసిందే. వేణుకి మరోసారి టికెట్ ఇస్తే తాను రాజీనామా చేసి, ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానని బోస్ సంచలన ప్రకటన చేస్తే.. సీఎం జగన్ ఉన్నంతవరకూ ఎమ్మెల్యే పదవి తనదేనంటూ మంత్రి వేణు తేల్చి చెప్పారు. ఇలా ఇద్దరు నేతలు తగ్గేదే లే అంటూ.. బహిరంగంగా సవాళ్లు విసురుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే హైకమాండ్ రంగంలోకి దిగి.. ఈ సమస్యని పరిష్కరించే చర్చలు చేపట్టింది.

Manipur violence: మరోసారి ఇంటర్నెట్ వినియోగంపై ఆంక్షలు.. ఈసారి కారణమేంటంటే..!

ఇప్పటికే ఈ వ్యవహారంలో గతంలో మూడుసార్లు రామచంద్రపురం నుంచి పోటీ చేసి గెలుపొందిన ప్రస్తుత ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులతో మిథున్ రెడ్డి భేటీ అయ్యారు. రామచంద్రపురం రాజకీయ పరిస్థితుల గురించి మిథున్ రెడ్డికి వివరించారు. ఇదే సమయంలో.. పిల్లి సుభాష్ పార్టీ మారొచ్చన్న రూమర్లూ పుట్టుకొచ్చాయి. ఆయన వైసీపీ వీడి, త్వరలోనే జనసేన పార్టీలోకి చేరొచ్చని పుకార్లు ఊపందుకున్నాయి. అయితే.. ఈ వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదని పిల్లి సుభాష్ స్పష్టం చేశారు. తాను జనసేన పార్టీలోకి వెళ్తున్నట్టు వస్తున్న వార్తలు కేవలం పుకార్లు మాత్రమేనని తాను వైసీపీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. వైసీపీ నిర్మాణంలో తాను కూడా ఒక పిల్లర్‌నేనని, అలాంటిది తాను వైసీపీ ఎలా వీడుతానని తిరిగి ప్రశ్నించారు.

MLA Sudhakar: పవన్ కళ్యాణ్‌ని ఫ్యాన్స్ నమ్మొద్దు.. ఆయన్ను సినిమా వరకే చూడండి

తాను ఎంపీ పదవికి రాజీనామా చేసి, ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానని చెప్పానని.. అందుకు సీఎం జగన్‌కి క్షమాపణలు చెప్తున్నానని పిల్లి సుభాష్ పేర్కొన్నారు. తాను అలా మాట్లాడకుండా ఉండాల్సిందని.. కాకపోతే పార్టీ క్యాడర్ నిరాశలో ఉండటంతో అలా మాట్లాడాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు. రామచంద్రపురంలో సీఎం పర్సనల్ టీం సర్వే చేసి నివేదిక ఇస్తారని.. అప్పుడు ఎవరి బలం ఎంత ఉంటుందనేది తేలుతుందని.. ఈ సర్వే రిపోర్ట్ ఆధారంగా చర్యలు ఉంటాయన్నారు. ఇందుకు తాను అంగీకరించానని తెలిపారు. కార్యకర్తల మీద క్రిమినల్ కేసులు పెడుతున్నారని, ఇందుకు సంబంధించిన పూర్తి ఆధారాల్ని సీఎంకి ఇచ్చామని అన్నారు. నిర్మొహమాటంగా ఇక్కడ జరుగుతున్న విషయాల్ని పార్టీ పెద్దలకి చెప్పారన్నారు.

Abdul Nazeer: గ్రామీణ వ్యాపార, వ్యవసాయ ఉత్పత్తుల అభివృద్ధిలో నాబార్డు పాత్ర ఎంతో ముఖ్యమైంది

కొన్నిసార్లు మనం అనుకున్నది జరగకపోవచ్చని.. కార్యకర్తల్ని ఇందులకు గురి చేస్తున్నప్పుడు, ఆ బాధతోనే గతంలో ఆ వ్యాఖ్యలు చేశానని పిల్లి సుభాష్ పేర్కొన్నారు. పార్టీ పెద్దలు తీసుకోవాల్సిన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. కచ్చితంగా పాజిటివ్ నిర్ణయం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మంత్రి పని మంత్రి చేసుకుంటాడని, తన పని తాను చేసుకుంటానని చెప్పుకొచ్చారు. పరిపక్వత వస్తే పాపం పండుతుందని హెచ్చరించారు.

Exit mobile version