NTV Telugu Site icon

PennaAhobilam Pilgrims Rush: పెన్నాఅహోబిలంలో భక్తుల సందడి

Penna Ahobilam

Penna Ahobilam

భారీవర్షాలతో తెలుగు రాష్ట్రాల్లో నదులు ఉప్పొంగుతున్నాయి. పొరుగున ఉన్న కర్నాటక నుంచి కూడా తుంగభద్ర జలాలు ఏపీ వైపు పరుగులు తీస్తున్నాయి. అనంతపురం జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం పెన్నా అహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో భక్తుల సందడి నెలకొంది. ఆలయం ప్రక్కనే తుంగభద్ర జలాల రాకతో జలకళ సంచరించుకుంది. దీంతో భక్తులు అధిక సంఖ్యలో పెన్నా అహోబిలంకు తరలి వస్తున్నారు. ఆలయం చుట్టూ పచ్చని చెట్లు జలాల సవ్వడి భక్తులను ఆకట్టుకుంటోంది.

తుంగభద్ర జలాలు పక్కనే ఉన్న కాల్వ ద్వారా మిడ్ పెన్నార్‌ జలాశయం పోతుడడంతో జలపాతాలు భక్తులను కనువిందు చేస్తున్నాయి. తుంగభద్ర డ్యాం ఇప్పటికే నిండిపోయింది. పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకుంది. దీంతో తుంగభద్ర జలాలను కిందికి విడుదల చేస్తున్నారు. అనంతపురం జిల్లాకు తుంగభద్ర ఎగువ కాలువ ద్వారా 1000 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఉరవకొండ మండలం మోపిడి లింకు ఛానల్ 189 కిలోమీటర్ వద్ద 450 కుసెక్కుల నీటిని మిడ్ పెన్నార్ జలాశయం మళ్లించారు అధికారులు. దీంతో తుంగభద్ర జలాలు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం పక్కనే పరవళ్లు తొక్కుతూ వెళుతున్నాయి.

Monkeypox: కామారెడ్డి జిల్లాలో మంకీపాక్స్ కలకలం!

పెన్నా అహోబిలం వద్ద నీటి ప్రవాహం అలలు పచ్చని చెట్లు మధ్య సాగుతోంది. ఆలయం చుట్టూ ఉన్న కోనేరు లోకి, చెట్లు మొదళ్ళు క్రింద జలాలు వస్తున్న దృశ్యాలు కనువిందు చేస్తున్నాయి. స్వామివారి దర్శనం కోసం భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు. తుంగభద్ర జలాలు రాకతో జలకళ సంచరించుకుంది. ఈ ఆహ్లాదకర వాతావరణం భక్తులను బాగా ఆకట్టుకుంటోంది. ఈ క్షేత్రానికి జిల్లా నలుమూలల నుండి కర్నాటకలోని బళ్ళారి నుంచి భక్తులు తరలి వస్తున్నారు. పెన్నా అహోబిలం రావడానికి ఇటు అనంతపురం నుంచి ఉరవకొండ, బళ్ళారి వెళ్లే బస్ లు,ఉరవకొండ నుంచి 15 నిమిషాలు ఒక బస్ నడుపుతున్నారు అధికారులు.

Minister Jagadish Reddy: కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డిపై మంత్రి జగదీశ్‌ రెడ్డి ఫైర్