సంక్రాంతి సంబరాల్లో అనేక పోటీలు నిర్వహిస్తున్నారు.. సంక్రాంతి వచ్చిందంటే చాలు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున సంబరాలు జరుగుతాయి.. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో కోడి పందాలు, ఎడ్ల పందాలులు చాలా ఫేమస్.. ముఖ్యంగా కోనసీమ జిల్లాల్లో ఇవి పెద్ద ఎత్తున నిర్వహిస్తారు.. ప్రభుత్వ యంత్రాంగం, పోలీసులు కూడా చూసిచూడనట్టుగా వ్యవహరించిన సందర్భాలే ఎక్కువని చెబుతారు.. అయితే, ఈ సారి కోడి పందేలు, ఎడ్ల పందాలకు భిన్నంగా.. పందుల పోటీలు నిర్వహించారు.. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం శివారు ప్రాంతం ఈ పందుల పోటీలకు వేదికైంది.. స్థానికంగా ఉండే గిరిజనులు పందుల పోటీలను నిర్వహించగా.. ఇక, ఈ పోటీలను చూడడానికి ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావడం విశేషం. మొత్తంగా.. సంక్రాంతి సంబరాలు ఈ సారి కొత్తగా పందుల పోటీలు కూడా చేరిపోయాయి.
Read Also: ఆర్థిక సంక్షోభంలో పాక్.. కొత్త పాలసీ ఆవిష్కరణ