Drone Camera: ఫొటోషూట్‌లు సర్వసాధారణం అయ్యాయి.. ఎక్కడైనా కాస్త మంచి లొకేష్ కనిపించిందంటే.. ఫొటోలు దిగడమే.. ఏదైనా బ్రిడ్జి ఎక్కామంటే ఫొటోలకు పోజులు ఇవ్వాల్సిందే.. అనే విధంగా యువత పరిస్థితి తయారైంది.. అయితే, ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా ప్రవర్తిస్తూ ఫ్లైఓవర్‌పై ఫొటో షూట్ పెట్టిన యువకులను పట్టించింది పోలీసుల డ్రోన్ కెమెరా..
Read Also: Indira Mahila Shakti: నేటి నుంచి ఇందిరా మహిళా శక్తి సంబరాలు..
తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తుమ్మలగుంట పరిసర ప్రాంతాలలో డ్రోన్ కెమెరాతో పోలీసులు బీట్ నిర్వహించారు.. తుమ్మలగుంట ఫ్లైఓవర్ పై కొంతమంది యువకులు వాహన చోదకులకు ఇబ్బందులు కల్గించే విధంగా ఫొటోషూట్ పేరుతో ఇబ్బంది కలిగిస్తున్నట్టు గుర్తించింది డ్రోన్ కెమెరా.. ఇక, డ్రోన్ కెమెరా యువకులను చిత్రీకరిస్తున్నట్లు గమనించి వెంటనే.. అక్కడి నుంచి బైకులపై పరారయ్యారు యువకులు.. అయితే, యువకులను ఎంఆర్ పల్లి పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా.. విద్యార్థులని విచారణలో తేలడంతో మొదటి తప్పుగా పరిగణించి వదిలి పెట్టారు పోలీసులు.. వాహనచోదకులకు ఇబ్బంది కలిగించే విధంగా ఫ్లైఓవర్స్ పైన పార్టీలు గానీ.. ఫొటో షూట్‌లు గానీ.. బైక్ రేసులుగానే నిర్వహిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు పోలీసులు..
