NTV Telugu Site icon

ఎస్ఈసీగా నీలం సాహ్ని నియామ‌కంపై పిటిష‌న్‌.. ప్ర‌భుత్వానికి హైకోర్టు నోటీసులు

Neelam Sahni

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎస్ఈసీగా నీలం సాహ్ని నియామకాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు అయ్యింది.. రేగు మహేష్ అనే వ్యక్తి ఈ పిటిషన్ దాఖ‌లు చేశారు.. ఎస్ఈసీగా నీలం సాహ్ని నియామ‌కం స‌రైంది కాద‌ని త‌న పిటిష‌న్‌లో పేర్కొన్నారు. అయితే, ఈ పిటిష‌న్‌ను విచార‌ణ‌కు స్వీక‌రించిన ఏపీ హైకోర్టు… రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.. సమ్మర్ వేకేషన్ తర్వాత ఈ పిటిష‌న్‌పై విచార‌ణ చేప‌ట్ట‌నున్న‌ట్టు పేర్కొంది. కాగా, ఎస్ఈసీగా ఉన్న నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్ కుమార్ ప‌ద‌వికాలం ముగియ‌డంతో… గ‌తంలో ఏపీ ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ప‌నిచేసిన నీలం సాహ్ని పేరును ప్ర‌భుత్వం గ‌వ‌ర్న‌ర్‌కు సిఫార‌సు చేయ‌డం.. ఆమెను గ‌వ‌ర్న‌ర్ ఎస్ఈసీగా నియ‌మించిన సంగ‌తి తెలిసిందే.