NTV Telugu Site icon

Perni Nani : మంచి కబురు వింటామని ఆశిస్తున్నాం

Perni Nani

Perni Nani

కృష్ణా జిల్లాకు చెందిన కొందరు మత్య్సకారులు ఇటీవల సముద్రంలో వేటకు వెళ్లి గల్లంతైన విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే వారికోసం అధికారం యంత్రాంగం ముమ్మర గాలింపు చర్యలు కొనసాగిస్తోంది. అయితే ఈ నేపథ్యంలో గల్లంతైన మత్స్యకారుల ఇళ్లకు వెళ్లి బాధితులను మాజీ మంత్రి పేర్ని నాని పరామర్శిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాచారం అందిన వెంటనే గాలింపు చర్యలు ముమ్మరం చేశామని ఆయన వెల్లడించారు. నిన్నటి నుంచి హెలికాప్టరులో సెర్చ్ ఆపరేషన్ చేపట్టామని, బోట్ల ద్వారా కూడా గాలింపు చర్యలు చేపడుతున్నామని ఆయన వెల్లడించారు. అత్యాధునిక సాంకేతికమైన డార్నియర్ ఫ్లైటు ద్వారా సెర్చ్ ఆపరేషన్ ప్రారంభమైందని ఆయన పేర్కొన్నారు.

కోల్‌కతా వరకు గాలించేందుకు చర్యలు చేపట్టినట్లు, సాయంత్రంలోగా మంచి కబురు వింటామని ఆశిస్తున్నామన్నారు. అయితే.. ఇప్పటికే గల్లైంతన వారి ఫోన్ లోకేషన్ ట్రేస్ చేసే ప్రయత్నం పోలీసులు చేస్తున్నారు. గల్లంతైన మత్స్యకారుల ఫోను ఐఎంఈఐకి ఐటీ కోర్ నుంచి బ్లాంక్ మెసేజ్‌ను పోలీసులు పంపారు. నిన్న ఉదయం బ్లాంక్ మెసేజ్ పంపితే.. రాత్రి పదకొండు గంటలకు మెసేజ్ డెలివరీ అయినట్టు సమాచారం. బ్లాంక్ మెసేజ్ డెలివరీ కావడంతో మత్స్యకారుల జాడ తెలుస్తుందని జిల్లా యంత్రాంగం ఆశిస్తోంది. ఇవాళ కూడా ఛాపర్ ద్వారా సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. చెన్నై నుంచి కాసేపట్లో నేవీ అధికారులు ఛాపర్ ద్వారా సెర్చ్ ఆపరేషన్ నిర్వహించనున్నారు.