Site icon NTV Telugu

Deputy CM Pawan: హ్యాపీ దీపావళి.. నయా నరకాసురులను ఎన్నికల్లో ప్రజలు ఓడించారు..

Pawan

Pawan

Deputy CM Pawan: తెలుగు ప్రజలందరికీ హృదయపూర్వక దీపావళి శుభాకాంక్షలు తెలిపారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. దీప కాంతులతో శోభాయమానంగా.. సంప్రదాయబద్ధంగా నిర్వహించుకొనే పండగ దీపావళి.. మన భారతదేశంలో చేసుకునే ప్రతీ పండుగకి ఒక పరమార్థం ఉంది.. మనకు జీవన శైలిని నేర్పుతుంది.. చీకటిపై వెలుగు, చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా దీపావళిని నిర్వహించుకుంటామని తెలియజేశారు. దీపావళి స్ఫూర్తితో నయా నరకాసురులను ప్రజాస్వామ్య యుద్ధంలో ప్రజలందరూ కలిసి ఓడించారు అంటూ పవన్ కళ్యాణ్ ఎద్దేవా చేశారు.

Read Also: IND-W vs ENG-W: టాస్ గెలిచిన ఇంగ్లాండ్.. ఈసారైనా భారత్ గెలిచేనా..?

ఇక, ఈ నయా నరకాసురులు మారీచుల్లాంటి వారు.. రూపాలు మార్చుకొంటూ- తమను ఓడించారనే అక్కసుతో.. ప్రజల మధ్య విభేదాలు సృష్టించి, అశాంతి రేకెత్తించే కుట్రలకు దిగుతున్నారు అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. కాబట్టి ప్రజలు అందరూ అప్రమత్తంగా ఉండి.. ఇలాంటి నయా నరకాసురులకు, వారి అనుచర గణానికి ఎప్పటికప్పుడు గుణపాఠం చెప్పాలి అని కోరారు. ఆడపడుచులు సత్యభామ స్ఫూర్తిని అందిపుచ్చుకోవాలి.. అలాగే, ఈ వేడుకల్లో టపాసులు కాల్చేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలి అని సూచించారు. దీపావళిని పర్యావరణహితంగా చేసుకోవాలని డిప్యూటీ సీఎం పవన్ ఆకాంక్షించారు.

Exit mobile version