Peedika Rajanna Dora: టీడీపీ నాయకులకు రాజన్న సవాల్.. ఎంతమంది వచ్చినా నేను రెడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Peedika Rajanna Dora Challenges TDP Leaders: ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్న దొర తాజాగా టీడీపీ నాయకులకు ఓ సవాల్ విసిరారు. విజయనగరం జిల్లా మెంటాడ మండలం పోరాం గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా సాలూరు నియోజకవర్గం టీడీపీ నాయకులకు ఓ ఛాలెంజ్ చేశారు. గిరిజన ప్రాంతాలలో అభివృద్ది, గిరిజన యూనివర్సిటీతో పాటు మరే ఇతర అంశాలపైన అయినా తాను చర్చకు రెడీ అని చెప్పారు. ‘‘టైమ్, డేట్ మీరే ఫిక్స్ చేయండి.. నేను ఒక్కడినే వస్తా, మీరు ఎంతమందైనా రండి’’ అంటూ పిలుపునిచ్చారు. ఇష్ఞం వచ్చినట్లుగా మాట్లాడితే ఊరుకొనే రోజులు పోయాయని.. కనీసం విజ్ఞత ఉందా అని నిలదీశారు. ఇటువంటి వాళ్లనా చంద్రబాబు నాయుడు క్యాండిడేట్స్‌గా పెట్టుకున్నారు? అని ప్రశ్నించారు.
Extramarital Affair: ఆరుగురు పిల్లల తల్లి.. ప్రియుడి మోజులో ఎంత దారుణం చేసిందంటే?
Also Read
సుమారు రూ.800 కోట్లు అభివృద్ధి పనులు జరిగాయని, ఇంకా కొన్ని పనులు జరుగుతున్నాయని రాజన్న తెలిపారు. ఇలాంటి పథకాలను ఎప్పుడైనా తీసుకొచ్చారా? అని టీడీపీ నాయకుల్ని ప్రశ్నించారు. ఇకపై తనని విమర్శిస్తే, ఎవ్వరినీ ఉపేక్షించనని హెచ్చరించారు. ఆడపిల్ల, గిరిజన అమ్మాయి అని తాను ఊరికే ఉన్నానని చెప్పారు. సంధ్యారాణి ఎన్నిసార్లు తనని విమర్శించినా.. ఏనాడూ ఆమె పేరెత్తకుండా తెలుగుదేశం పార్టీపైనే మాట్లాడేవాడినని స్పష్టం చేశారు. ఇకపై రాజన్నదొర అంటే ఏంటో చూస్తారని వార్నింగ్ ఇచ్చారు. ఎమ్మెల్యేగా అయినా, గిరిజన శాఖ మంత్రి అయినా అలానే ఉంటాడని చూపిస్తానంటూ తేల్చి చెప్పారు. కాగా.. ఈ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో వైసీపీ ప్రభుత్వం అందిస్తున్న పథకాలను ప్రజలకు తెలియజేశారు. పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలను అందించిన ఘనత ఒక్క సీఎం జగన్‌కే దక్కుతుందని పేర్కొన్నారు.
New Parliament pics: కొత్త పార్లమెంట్ ప్రతీ భారతీయుడు గర్వించేలా ఉంటుందన్న ప్రధాని….
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్‌కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్‌నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!