Site icon NTV Telugu

Peedika Rajanna Dora: టీడీపీ నాయకులకు రాజన్న సవాల్.. ఎంతమంది వచ్చినా నేను రెడీ

Rajanna Dora

Rajanna Dora

Peedika Rajanna Dora Challenges TDP Leaders: ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్న దొర తాజాగా టీడీపీ నాయకులకు ఓ సవాల్ విసిరారు. విజయనగరం జిల్లా మెంటాడ మండలం పోరాం గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా సాలూరు నియోజకవర్గం టీడీపీ నాయకులకు ఓ ఛాలెంజ్ చేశారు. గిరిజన ప్రాంతాలలో అభివృద్ది, గిరిజన యూనివర్సిటీ‌తో పాటు మరే ఇతర అంశాలపైన అయినా తాను చర్చకు రెడీ అని చెప్పారు. ‘‘టైమ్, డేట్ మీరే ఫిక్స్ చేయండి.. నేను ఒక్కడినే వస్తా, మీరు ఎంతమందైనా రండి’’ అంటూ పిలుపునిచ్చారు. ఇష్ఞం వచ్చినట్లుగా మాట్లాడితే ఊరుకొనే రోజులు పోయాయని.. కనీసం విజ్ఞత ఉందా అని నిలదీశారు. ఇటువంటి వాళ్లనా చంద్రబాబు నాయుడు క్యాండిడేట్స్‌గా పెట్టుకున్నారు? అని ప్రశ్నించారు.

Extramarital Affair: ఆరుగురు పిల్లల తల్లి.. ప్రియుడి మోజులో ఎంత దారుణం చేసిందంటే?

సుమారు రూ.800 కోట్లు అభివృద్ధి పనులు జరిగాయని, ఇంకా కొన్ని పనులు జరుగుతున్నాయని రాజన్న తెలిపారు. ఇలాంటి పథకాలను ఎప్పుడైనా తీసుకొచ్చారా? అని టీడీపీ నాయకుల్ని ప్రశ్నించారు. ఇకపై తనని విమర్శిస్తే, ఎవ్వరినీ ఉపేక్షించనని హెచ్చరించారు. ఆడపిల్ల, గిరిజన అమ్మాయి అని తాను ఊరికే ఉన్నానని చెప్పారు. సంధ్యారాణి ఎన్నిసార్లు తనని విమర్శించినా.. ఏనాడూ ఆమె పేరెత్తకుండా తెలుగుదేశం పార్టీపైనే మాట్లాడేవాడినని స్పష్టం చేశారు. ఇకపై రాజన్నదొర అంటే ఏంటో చూస్తారని వార్నింగ్ ఇచ్చారు. ఎమ్మెల్యేగా అయినా, గిరిజన శాఖ మంత్రి అయినా అలానే ఉంటాడని చూపిస్తానంటూ తేల్చి చెప్పారు. కాగా.. ఈ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో వైసీపీ ప్రభుత్వం అందిస్తున్న పథకాలను ప్రజలకు తెలియజేశారు. పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలను అందించిన ఘనత ఒక్క సీఎం జగన్‌కే దక్కుతుందని పేర్కొన్నారు.

New Parliament pics: కొత్త పార్లమెంట్ ప్రతీ భారతీయుడు గర్వించేలా ఉంటుందన్న ప్రధాని….

Exit mobile version