NTV Telugu Site icon

Peddireddy Ramachandra Reddy: కొత్త పరిశ్రమలను సీఎం జగన్ పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్నారు

Peddireddy Ramachandra Redd

Peddireddy Ramachandra Redd

Peddireddy Ramachandra Reddy: రాష్ట్ర విద్యుత్, అటవీ, పర్యావరణం, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శనివారం తిరుపతిలో పొల్యుషన్ కంట్రోల్ బోర్డు రీజనల్ ఆఫీస్ & ల్యాబరేటరిని ప్రారంభించారు. ఈ భవనానికి డాక్టర్ వైఎస్సార్ పర్యావరణ భవనంగా నామకరణం చేశారు. రూ.16.50 కోట్లతో ఈ నూతన భవనాన్ని నిర్మించారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. తిరుపతిలో సొంత భవనాన్ని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. సిఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పర్యావరణంపై ప్రత్యేక శ్రద్ద తీసుకుని మార్పులు తెచ్చారని.. కొత్త పరిశ్రమలను పెద్దఎత్తున రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్నారని కొనియాడారు. జూన్ నెలలో ఎన్నడూ లేని విధంగా 263.13 మిలియన్ మెగా వాట్ల విద్యుత్ వినియోగం పరిశ్రమల ఏర్పాటుకి నిదర్శనమని పేర్కొన్నారు. ఎక్కడా కాలుష్యం లేకుండా కాలుష్య నియంత్రణ మండలి అనేక చర్యలు చేపట్టిందన్నారు.

Warangal: బిడ్డకు పాలిస్తూ హార్ట్‌ఎటాక్ తో తల్లి మృతి.. మరి బిడ్డ పరిస్థితి..!

వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాలుష్య కారక వ్యర్థాల నియంత్రణలో చర్యలు చేపట్టామని మంత్రి పెద్దిరెడ్డి పేర్కొన్నారు. తిరుపతిలో ప్రారంభించిన నూతన భవనంలో ఒక ల్యాబ్‌ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పరిశ్రమలు ఎలాంటి వ్యర్ధాలు విడుదల చేస్తున్నాయని ఎప్పటికప్పుడు గమనించి చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ప్రమాదాలు లేకుండా రెడ్, ఆరెంజ్ కేటగిరీ పరిశ్రమలు పని చేస్తున్నాయన్నారు. నియమాలు అధిగమిస్తే వెంటనే చర్యలు చేపడుతున్నామని చెప్పారు. ఆక్వా రంగం ద్వారా జరిగే కాలుష్యాన్ని కూడా నివారించే చర్యలు చేపట్టామన్నారు. తిరుమలలో పూర్తి స్థాయిలో ప్లాస్టిక్‌ను నియంత్రించామని వెల్లడించారు. ఎప్పటికప్పుడు ప్రజల భద్రత దృష్ట్యా పని చేస్తున్న కాలుష్య నియంత్రణ మండలి సిబ్బందికి అభినందనలు తెలిపారు. అధికారులు కోరినట్టుగా తిరుపతిలో జోనల్ కార్యాలయం ఏర్పాటు చేస్తామని మంత్రి పెద్దిరెడ్డి హామీ ఇచ్చారు.

Sudha Murty Birthday: వందలకోట్ల ఆస్తులున్నా.. 24 ఏళ్లుగా ఒక్కచీర కూడా కొనని సుధామూర్తి

ఇదే సమయంలో కర్రల వివాదంపై మంత్రి పెద్దిరెడ్డి స్పందించారు. తనకు కర్రల వివాదం గురించి తెలియదని, అసలు వినలేదని అన్నారు. చిన్నారి లక్షితను చిరుతపులి చంపడం బాధకరమైన విషయమని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో బాలుడ్ని చిరుత దాడి చేస్తే కాపాడుకున్నామని గుర్తు చేశారు. రెండు చిరుతపులిలను బంధించి జూ లోనే ఉంచుతున్నామన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. కంచె వేయడమా లేదా శాశ్వతంగా సెక్యూరిటీ ఉంచాలా అనే దానిపై ఆలోచన చేస్తున్నామన్నారు. అటవీ శాఖలో సిబ్బంది కొరత లేదన్నారు. ఘటన జరిగింది టీడీడీ పరిదిలోని అటవీ ప్రాంతంలో అని తెలిపారు. టీటీడీ ఇచ్చే నివేదిక ఆధారంగా అటవీశాఖ తదుపరి చర్యలు తీసుకుంటుందని చెప్పుకొచ్చారు.

Minister KTR: ఇక ట్రాఫిక్ జామ్ లుండవు.. స్టీల్‌ బ్రిడ్జిని ప్రారంభించిన కేటీఆర్‌..