NTV Telugu Site icon

Peddireddy Ramachandra Reddy: చంద్రబాబు రాజకీయంగా అంగవైకల్యంతో బాధపడుతున్నారు

Pedireddy Environment

Pedireddy Environment

Peddireddy Ramachandra Reddy: టీడీపీ అధినేత చంద్రబాబు రాజకీయంగా అంగవైకల్యంతో బాధపడుతున్నారని.. వేరే రాజకీయ పార్టీలపై ఆధారపడుతున్నారని ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. చంద్రబాబు వేరే పార్టీల అండ కోసం తాపత్రయపడుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా.. అమరావతిలో కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి పెద్దిరెడ్డి.. ఏపీ పీసీబీ ఏర్పాటు చేసిన స్టాళ్లని సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ముందస్తుకు వెళ్లే ఆలోచన వైసీపీకి లేదని స్పష్టం చేశారు. పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు రెండూ కలిసే వస్తాయని.. అప్పుడే ఎన్నికలకు వెళ్తామని క్లారిటీ ఇచ్చారు. తాము బలంగా ఉన్నామన్న ఆయన.. తమకు వేరే పార్టీల గురించి అనవసరం లేదని తేల్చి చెప్పారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఘనవిజయం సాధిస్తుందని, జగన్ మరోసారి సీఎం అవుతారని ధీమా వ్యక్తం చేశారు. ఇక జనసేనాధిపతి పవన్ కళ్యాణ్ గురించి తానేమీ మాట్లాడనని పేర్కొన్నారు.

Mahesh : రాజమౌళి సినిమా కోసం భారీగా ఛార్జ్ చేస్తున్న మహేష్..!!

అనంతరం పెద్దిరెడ్డి పర్యావరణ పరిరక్షణ ప్రాముఖ్యత గురించి వివరించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాస్టిక్ ఫ్లెక్సీలను నిషేధించామన్నారు. టీటీడీ సహా అన్ని దేవాలయాల్లో ప్లాస్టిక్ బ్యాగుల వినియోగం తగ్గించామన్నారు. సముద్ర, నదీ తీరాల్లో, చెరువులు, కాల్వల్లో క్లీనింగ్ కార్యక్రమం చేపట్టామని తెలిపారు. కాలుష్య రహిత విద్యుత్ ఉత్పత్తికి ఏపీ ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని తెలియజేశారు. రూ.13 లక్షల కోట్ల ఎంఓయూల్లో మెజార్టీ ఎంఓయూలు కాలుష్య రహిత విద్యుత్ ఉత్పత్తికి సంబంధించే వచ్చాయన్నారు. 160 అర్బన్ ప్రాంతాల్లో నగరవనాలు ఏర్పాటు చేశామన్నారు. అడవుల విస్తీర్ణానికి ఏపీ ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పుకొచ్చారు. కాగా.. ఈ సదస్సులో మంత్రి పెద్దిరెడ్డి ప్లాస్టిక్ కాలుష్యం, పరిష్కారంపై చర్చించారు. ఏటీబీ మిషన్‌నూ లాంఛ్ చేశారు. ఈ మిషన్‌లో రూ.10 నాణెం వేస్తే.. బ్యాగ్ వచ్చేలా తయారు చేశారు.

Rashmi : ఆ విషయంలో ఏదైనా తప్పు చేసి ఉంటే క్షమించండి..!!