Site icon NTV Telugu

Dwarakanath Reddy: చంద్రబాబు దమ్ముంటే రా..!

Peddireddy Dwarakanath Redd

Peddireddy Dwarakanath Redd

టీడీపీ అధినేత చంద్రబాబు, పార్టీ ప్రధాన కార్యదర్శిపై ఓ రేంజ్‌లో ఫైర్‌ అయ్యారు తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి… ఖబడ్దార్ చంద్రబాబు నోరు అదుపులో పెట్టుకో అని హెచ్చరించిన ఆయన.. దమ్ముంటే చంద్రబాబు లేదా లోకేష్ తంబళ్లపల్లెలో నాపై పోటీ చేయాలని.. డిపాజిట్లు తెచ్చుకోవాలని సవాల్‌ విసిరారు.. ఇక, కుప్పంలో రాజీనామా చేయి.. నీకు డిపాజిట్లు గల్లంతు చేస్తానని ప్రకటించారు. ఎక్కడో నీ పక్కన కిశోర్ కుమార్ రెడ్డిని, కడప నుంచి వచ్చిన శ్రీనివాసులు రెడ్డిని పెట్టుకొని చిల్లర మాటలు మాట్లాడితే ఖబడ్ధార్ అని వార్నింగ్‌ ఇచ్చారు. రెండు గజ్జికుక్కలను పక్కన పెట్టుకొని ఏదంటే అది మాట్లాడితే సరిపోతుంది అని నువ్వు అనుకొంటే అది నీ భ్రమ అని మండిపడ్డారు.. తంబళ్లపల్లిలో దొంగలను, డేకాయిట్‌ని చేర్చుకొని నీ పక్కలో కూర్చో బెట్టుకున్నావంటే నీ స్థాయి ఏపాటిదో ప్రజలకు అర్థం అవుతుందన్నారు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి.

Read Also: COVID vaccine: చిన్నారులకు వ్యాక్సినేషన్‌లో ట్విస్ట్..!

Exit mobile version