Site icon NTV Telugu

Peddireddi Ramachandrareddy: విద్యుత్ ఇబ్బందులు లేకుండా చర్యలు

ఏపీలో విద్యుత్ కష్టాలు జనానికి ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయి. పరిశ్రమలకు కూడా ఇక్కట్లు పాలవుతున్నాయి. ఈనేపథ్యంలో విద్యుత్ శాఖపై మంత్రి పెద్దిరెడ్డి సమీక్ష నిర్వహించారు. విద్యుత్ పరిస్థితి.. అదనపు విద్యుత్ ఉత్పత్తికి అవకాశాలపై చర్చించారు. అదనంగా మరో 1600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి చర్యలు తీసుకోవాలని మంత్రి పెద్దిరెడ్డి ఆదేశాలిచ్చారు.

కృష్ణపట్నం, ఎన్టీటిపిఎస్సులల్లో 800 మెగావాట్ల విద్యుత్ యూనిట్లను వినియోగించుకోవాలని సూచన.హైడెల్ ప్లాంట్ల ద్వారా మరో 6000 మెగావాట్ల ఉత్పత్తికి ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్టు అధికారుల వెల్లడి.మే ఒకటి నుంచి సాధారణ స్థాయికి విద్యుత్ ఉత్పత్తి జరుగుతుందన్నారు అధికారులు.రాష్ట్రంలో ప్రస్తుతం రోజువారీ డిమాండ్ 235 మిలియన్ యూనిట్లు.. 150 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి మాత్రమే జరుగుతోందన్నారు జెన్కో అధికారులు.

30 మిలియన్ యూనిట్ల మేర విద్యుత్ ను విద్యుత్ ఎక్స్ఛేంజీల నుంచి సమకూర్చుకుంటున్నట్టు వెల్లడించారు. వ్యవసాయం, పరిశ్రమలకు విద్యుత్ సరఫరా విషయంలో అండగా ఉంటాం అన్నారు. దేశం మొత్తం విద్యుత్ ఇబ్బందులను ఎదుర్కొంటోంది. రాష్ట్రంలో విద్యుత్ సమస్యను అధిగమించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. భవిష్యత్ లోనూ 24 గంటల పాటు నిరంతరాయ విద్యుత్ కొనసాగించాలనేదే ప్రభుత్వ లక్ష్యం. వ్యవసాయానికి పగటి పూట 7 గంటలు, గృహ విద్యుత్ సరఫరాకు ఢోకా లేకుండా విద్యుత్ సంస్థలు చర్యలు తీసుకున్నాయని వివరించారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.

Read Also: Pawan Kalyan: రైతుల్ని కాపాడుకోలేని వ్యవస్థ దండగ

Exit mobile version