NTV Telugu Site icon

Pawan Kalyan: మరోసారి ఆ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్ర భవిష్యత్ చీకటే

Pawan

Pawan

అమరావత రాజధాని ప్రాంతంలోని మందడం గ్రామంలో భోగి మంటల కార్యక్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడితో పాటు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ భోగి సంబరాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లడుతూ.. టీడీపీ- జనసేన కలిసి సుస్థిరమైన ప్రభుత్వం ఏర్పాటు చేస్తామన్నారు. మా ప్రభుత్వం వచ్చాక అమరావతిని బంగారు రాజధానిగా నిర్మించుకుందామని తెలిపారు. జై అమరావతి, జై ఆంధ్రా అనే నినాదంతో ముందుకెళ్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఉపాధి లేదు, నిరుద్యోగం పెరిగిపోయింది అని ఆయన చెప్పారు. మరోసారి వైసీపీ వస్తే రాష్ట్ర భవిష్యత్ చీకటే.. రాజధాని రైతులకున్న కీడు, పీడ తొలగిపోయే రోజులు దగ్గర ఉన్నాయి.. రాజధాని రైతులు పడ్డ కష్టం ఇబ్బందులను తీర్చడానికి టీడీపీ – జనసేన కలిశాయని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెల్లడించారు.

Read Also: Chandrababu: ఇవాళ్టి నుంచి 87 రోజులే.. కౌంట్ డౌన్ స్టార్ట్.. లెక్క పెట్టుకోండి

రైతుల కష్టాన్ని మేం తీరుస్తామని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ తెలిపారు. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ అంటూ అదే వర్గాలను మోసం చేసింది వైసీపీ.. ముళ్ల కంచెలు వేసినా దాటుకుని రాజధాని రైతుల వద్దకు వచ్చాం.. మరోసారి వైసీపీ వస్తే రాజధానికి భవిష్యత్ చీకటేనని ఆయన వెల్లడించారు. అమరావతి వేదిక నుంచి తెలుగు వారందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను.. వచ్చే ఏడాది జనసేన – టీడీపీ ప్రభుత్వంలో సంక్రాంతి పండుగను ఆనందంగా జరుపుకుందాం.. ఈ సంక్రాంతి మార్పుతో వచ్చిన విప్లవ కాంతి.. క్రాంతితో కూడుకున్న కాంతి రావాలని ఆశిస్తున్నాను అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.