Site icon NTV Telugu

Janasena Social Audit: జగనన్న ఇళ్లపై జనసేన సోషల్ ఆడిట్.. పాల్గొననున్న పవన్‌ కల్యాణ్‌..

Pawan Kalyan

Pawan Kalyan

జనసేన పార్టీ మరో ఉద్యమానికి శ్రీకారం చుడుతోంది.. ఈ నెల 12,13,14 తేదీల్లో జగనన్న ఇళ్లు, టిడ్కో ఇళ్లపై జనసేన పార్టీ సోషల్ ఆడిట్ చేపట్టబోతోంది… మూడు రోజుల పాటు జనసేన నిర్వహించే సోషల్ ఆడిట్ కార్యక్రమంలో పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ పాల్గొనబోతున్నారు.. రాజమండ్రి, గుంటూరు జిల్లాల్లో జరిగే సోషల్ ఆడిట్ కార్యక్రమంలో పవన్‌ పాల్గొంటారని పార్టీ శ్రేణులు వెల్లడించారు.. అంతేకాదు.. మరో ఒకట్రొండు చోట్ల కూడా పాల్గొందామా..? వద్దా..? అనే అంశంపై పవన్‌ కల్యాణ్‌ తర్జన భర్జన పడుతోన్నట్టుగా జనసేన శ్రేణులు చెబుతున్నాయి..

Read Also: Pawan Kalyan: ఇప్పటం బాధితులకు అండగా పవన్‌ కల్యాణ్‌.. ఆర్థిక సాయం ప్రకటన

ఇప్పటికే వివిధ కార్యక్రమాలతో జనం వద్దకు వెళ్తున్న జనసేన పార్టీ.. జనవాణి కార్యక్రమం నిర్వహిస్తోంది.. కౌలురైతుల కుటుంబాల పరామర్శలు జరుగుతున్నాయి.. ఇప్పుడు కొత్తగా జనసేన సోషల్ ఆడిట్ అంటూ మరో పోరాట పంథాను ఎంచుకుంది… అయితే, ప్రభుత్వం పథకాలు క్షేత్ర స్థాయిలో సరిగా అమలవుతున్నాయా లేదా? వాటి లోటుపాట్లేంటి..? ప్రజల ఇబ్బందులేంటి…? అనే వాటిపై ప్రజల నుంచే సమాచారాన్ని సేకరించడం కోసం ఈ సోషల్‌ ఆడిట్‌ నిర్వహిస్తోంది జనసేన.. ఈ సందర్భంగా సేకరించిన సమాచారాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి.. వాటిలోని లోటుపాట్లను ఎత్తిచూపుతూ.. సర్కార్‌ను నిలదీయడం.. పథకాల్లోని లొసుగులను చూపిస్తూ.. సక్రమంగా అమలు చేసేలా చూస్తామంటున్నారు ఆ పార్టీ నేతలు..

Exit mobile version