Site icon NTV Telugu

Pawan Kalyan : ఎవరికి.. ఎవరు ‘ఎర’..?

రాజకీయ నాయకుడిగా మారిన నటుడు పవన్ కళ్యాణ్ ఒక కోట్ పోస్ట్ చేసారు. ఇది సినీ పరిశ్రమతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుత పరిస్థితిగా కనిపిస్తుంది. ఎలాంటి రిఫరెన్స్ తీసుకోకుండా లేదా ఎలాంటి ఉదంతాన్ని ఉటంకించకుండా, పవన్ కళ్యాణ్ ఈ ట్వీట్ చేయడంతో ప్రస్తుతం అది వైరల్‌గా మారింది. “నాకు ఇష్టమైన వాటిలో ఒకటి: ‘ఎర’ను ఆహారం అనుకుని ఆశపడే స్థితిలో ఉన్న ప్రతిజాతి వేటగాళ్లకు చిక్కుతూనే ఉంటుంది…. – వాకాడ శ్రీనివాసరావు”. అని పోస్ట్‌ చేశారు. అయితే ఏ విషయాన్ని ఉద్దేశిస్తూ పవన్ కళ్యాణ్ ఈ ట్వీట్‌ చేశారో క్లారిటీ రాలేదు గానీ.. అభిమానులు మాత్రం వాళ్లకు నచ్చిన మేసేజ్‌ ను తీసుకుంటున్నారు.

అభిమానుల్లో కొందరు ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాల పరిస్థితులకు సంబంధించి ట్వీట్ చేసారని అనుకుంటుండగా, మరికొందరు ఇటీవల సినీ ఇండ్రస్టీకి సంబంధించిన సమస్యలపై సీఎం జగన్‌తో చిరంజీవి టీం చర్చించిన విషయమని అనుకుంటున్నారు. ఏదేమైనా.. జనసేనాని క్లారిటీ ఇవ్వకుండానే ఏపీ ప్రభుత్వంకు కౌంటర్‌ వేసినట్లు ఉందని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.

Exit mobile version