NTV Telugu Site icon

Pawan Kalyan: నాకు ప్రాణహాని ఉంది.. ప్రత్యేక సుపారీ ఇచ్చారు

Pawan Kalyan Pranahani

Pawan Kalyan Pranahani

Pawan Kalyan Says He Have Life Threat In Politics: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన కార్యవర్గ సమావేశంలో జనసేనాధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు ప్రాణహాని ఉందని, తనని చంపేందుకు ప్రత్యేక సుపారీ ఇచ్చారని బాంబ్ పేల్చారు. తాను బ్రతికి ఉండాలంటే సెక్యూరిటీ తప్పనిసరి అని.. అందుకే సెక్యూరిటీ పెట్టుకున్నానని చెప్పారు. తన వల్ల వాళ్లకు ఇబ్బంది ఉన్నప్పుడు.. తనని బ్రతకనిస్తారా? అని అన్నారు. 2019లో వైసీపీ అధికారంలోకి రాకపోతే.. తనని చంపేద్దామని అనుకున్నారని కుండబద్దలు కొట్టారు. తానేమీ కల్పించి ఈ వ్యాఖ్యలు చేయడం లేదని, అలాంటి రికార్డ్స్ తన వద్ద ఉన్నాయని.. ఇంటెలిజెన్స్ వర్గాల వారు తనకు రిపోర్ట్స్ పంపించారని షాకిచ్చారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలోని 34 సీట్లలో.. వైసీపీకి ఒక్క సీటు కూడా రాకూడదని పిలుపునిచ్చారు.

UK: తాగుబోతు మహిళపై భారతీయ విద్యార్థి అత్యాచారం.. సీసీటీవీ ఫుటేజీలో రికార్డ్

అంతకుముందు పిఠాపురంలో జరిగిన వారాహి విజయ యాత్రలో.. రాష్ట్ర ప్రభుత్వంపై పవన్ కళ్యాణ్ మాటల తూటాలతో విరుచుకుపడ్డారు. అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయంలో తన రెండు చెప్పులు బయట వదిలి వెళ్తే, అవి ఎవరో కొట్టేశారని.. చివరికి చెప్పులు కొట్టేసే స్థాయికి వైసీపీ ప్రభుత్వం వచ్చిందని నిప్పులు చెరిగారు. తిరుపతిని దోపిడీ చేస్తున్నారని.. ఏడు కొండలతో ఆటలు ఆడితే నామరూపాల్లేకుండా పోతారని హెచ్చరించారు. హిందూ దేవాలయాలపై ఈ ప్రభుత్వం కన్నేసిందని అన్నారు. తనకు అధికారం ఇవ్వాలని ప్రజల్ని అభ్యర్థించిన పవన్.. తాను సీఎం అవ్వడానికి సిద్ధంగా ఉన్నానని, తాను గెలవడానికి ఏ వ్యూహం అయినా వేస్తానని చెప్పుకొచ్చారు. పిచ్చివాడుగు వాగితే బయటకు తీసుకొచ్చి కొడతానని వార్నింగ్ ఇచ్చారు. తన జనసేన పార్టీ అధికారంలోకి వస్తే.. పిఠాపురంని ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు.

Earthquake: లేహ్-లడఖ్‌లో భూకంపం.. 4 గంటల్లో రెండవసారి కంపించిన భూమి