వెల్లంపల్లి వెల్లుల్లిపాయకు బంతి చామంతి నేతలంటూ వైసీపీ నేతలపై సెటైర్లు వేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. సంపూర్థ మద్యపాన నిషేదం ద్వారా మద్యం ఆదాయం పెంచుకుంటాం.. ప్రభుత్వం తప్పులను ప్రశ్నిస్తే.. వైసీపీ ఎంపీనైనా చితక్కొట్టిస్తాం.. ఒక్క ఛాన్స్ ఇస్తే ఏపీని 25 ఏళ్లు వెనక్కు తీసుకెళ్తాం.. మరోసారి ఛాన్స్ ఇస్తే స్కూల్ పిల్లల చేతుల్లో చాక్లెట్లు లాక్కొంటామన్న రీతిలో వైసీపీ వ్యవహరిస్తోందన్న ఆయన.. ప్రతిపక్షంలోకి ఉండి అమరావతిని ఒప్పుకుని.. అధికారంలోకి రాగానే రాజధానిని రద్దు చేసిందన్నారు.. కొందరు వైసీపీ నేతలు ఒళ్లు పొగరుతో మాట్లాడుతున్నారు.. క్రిమినల్స్ రాజకీయాలు చేస్తే పరిస్థితి ఇలాగే ఉంటుందన్నారు..
Read Also: Pawan Kalyan: ఎట్టి పరిస్థితుల్లో వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వం
ప్రభుత్వం చేసిన తప్పులకు సీనియర్ ఐఏఎస్ అధికారులు కోర్టుల్లో నిలబడాల్సిన పరిస్థితి కల్పించారని ఆవేదన వ్యక్తం చేసిన పవన్ కల్యాణ్.. బంతి చామంతి అవంతి.. వెల్లంపల్లి వెల్లులిపాయలకు ఐఏఎస్సులకు ఉన్న నాలెడ్జ్ ఉందా..? అని ప్రశ్నించారు. పోలీసులకు జీతభత్యాలే కాదు.. కరువు భత్యం కూడా ఇవ్వడం లేదని విమర్శించిన ఆయన.. మాట వినని పోలీసులను వీఆర్ లోకి పంపుతున్నారు.. సీపీఎస్ విధానాన్ని వారం రోజుల్లో రద్దు చేస్తామన్నారు.. ఇప్పుడు మొండికేస్తున్నారు. ఇప్పుడు అడిగితే మా నాయకుడికి టెక్నికాలిటీస్ తెలియలేదన్నారు. పార్టీ రంగులేయడానికి వేల కోట్లు ఖర్చు పెట్టారు.. కానీ ఉద్యోగుల జీతాలు తగ్గించారు అని మండిపడ్డారు పవన్ కల్యాణ్.
