Site icon NTV Telugu

కర్నూలు జిల్లాకు దామోదరం సంజీవయ్య పేరు పెట్టాలి : పవన్ కళ్యాణ్

కర్నూలు జిల్లాకు దామోదరం సంజీవయ్య పేరు పెట్టాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిమాండ్‌ చేశారు. ఇది డిమాండ్ కాదు… ఒక హక్కుగా రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నామని పేర్కొన్నారు పవన్‌ కళ్యాణ్‌. వైసీపీ ప్రభుత్వం పట్టించుకోకపోతే అధికార మార్పిడి తరవాత జనసేన ఆ ప్రక్రియ చేపడుతుందని… అధికార మార్పిడి తర్వాత ‘దామోదరం సంజీవయ్య కర్నూలు జిల్లా’గా పేరుగా మారుస్తామన్నారు. కడప జిల్లా పేరును వైఎస్ఆర్ కడప జిల్లాగా మార్చినప్పుడు.. సంజీవయ్య పేరు కర్నూలు జిల్లాకు పెట్టడం సమంజసమేనని చెప్పారు. దామోదరం సంజీవయ్య పేరు ఒక్క పథకానికీ పెట్టలేదని… అణగారిన వర్గాల ఆశాజ్యోతి, మహనీయుడు దామోదరం సంజీవయ్య అని కొనియాడారు.

Exit mobile version